విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాస నిర్ణయంపై ఏపీ రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే అది కూటమి ఖాతాలోకి పోతుందని తెలిసి కూడా హఠాత్తుగా రాజీనామా చేస్తున్నారంటే ఖచ్చితంగా బలమైన కారణం ఉండి ఉంటుందని చెబుతున్నారు. ఆ కారణం ఏమిటన్నది మాత్రం వైసీపీ నేతలకు అంతు చిక్కడం లేదు. అబద్దాలు చెప్పలేక రాజీనామా చేశానని ఆయన చెబుతున్నారు. అంత కంటే పెద్ద అబద్దం ఉండదని అందరికీ తెలుసు.
విజయసాయిరెడ్డి బెదిరించే వ్యక్తి. బూతులు తిట్టే వ్యక్తి. కానీ బెదిరింపులకు లొంగిపోయి ఏకంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పరు. కానీ తప్పించుకోలేని పరిస్థితి వస్తే.. పదవులు, రాజకీయం కన్నా తాను బయటపడటమే ముఖ్యం అనుకుంటే ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. అలా బయటపడలేని పరిస్థితులు ఏమి వచ్చాయన్నది ఇప్పుడు వైసీపీలోనూ చాలా మందికి అర్థం కాని విషయం.
కాకినాడ పోర్టు వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పుడు చంద్రబాబును చంపుతామను అన్నట్లుగా మాట్లాడారు. ఆయన మాటలపై దుమారం రేగింది. తర్వాత ఈడీ పిలిచింది. కేవీ రావు ఎవరో తెలియదని మీడియాకు చెప్పారు. కానీ ఆయన చేసిన దందాను ఆధారాలతో సహా ఈడీ అధికారులు బయట పెట్టడంతో ఆయన మైండ్ బ్లాంక్ అయిందని చెబుతున్నారు. ఆయన వ్యక్తిత్వం, తీరు చూస్తే.. ఎవరూ ఊహించనంత బలమైన కారణం వల్లనే రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నారని.. అదేమిటో తెలియాల్సి ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.