విజయసాయిరెడ్డి జగన్ ను టార్గెట్ చేస్తున్నారని అందరూ అనుకుంటున్నారు. నిజానికి ఆయన జగన్ ను పల్లెత్తు మాట అనడం లేదు. ఆయనను దేవుడు అనే అంటున్నారు. ఆయన చుట్టూ ఉండే కొంత మంది నేతల్ని కోటరీ పేరుతో విమర్శిస్తున్నారు. వారిని తప్పించాలని అంటున్నారు. వారే తప్పులు చేస్తున్నారని అంటున్నారు. జగన్ కు తెలియకుండా వారంతా తప్పు లు చేసి ఆయనను ఇబ్బంది పెడుతున్నారని అంటున్నారు. ఇక్కడే విజయసాయిరెడ్డి లోగుట్టు రాజకీయమేంటో అర్థమైపోతుంది.
కోటరీదే తప్పని రుద్దుతున్న విజయసాయిరెడ్డి
జగన్ రెడ్డి పరిస్థితి పూర్తిగా తేలిపోయింది. రాజకీయంగా ఆయనకు భవిష్యత్ ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. ఎందుకంటే ఆయన చేసిన తప్పులు అలాంటివి. మరి ఇప్పుడు జగన్ ను గట్టెక్కించాలంటే ఏం చేయాలి?. తప్పు అంతా ఆయన కోటరీపై తోసేయాలి. జగన్ ను స్వాతిముత్యంగా ప్రజెంట్ చేయాలి. ఇప్పుడు అదే మిషన్ ప్రారంభమయింది. విజయసాయిరెడ్డి ప్రధాన పాత్రధారిగా తెరపైకి వచ్చారు. కోటరీపై విమర్శలు చేస్తున్నారు.
వారిని వదిలించుకునేందుకే జగన్ , విసా.రెడ్డి కలిసి ప్లాన్ చేశారా?
సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మరికొందరిని వదిలించుకునే ప్లాన్ లోనే జగన్ రెడ్డి కోటరీ అంశాన్ని విజయసాయిరెడ్డి ద్వారా హైలెట్ చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ కు తెలియకుండా కోటరీ కూడా ఏమీ చేయలేదు. జగన్ చెప్పిందే కోటరీ చేస్తుంది. బయట ఏం జరుగుతుందో జగన్ కు తెలియదని చెప్పడం కంటే ఘోరమైన విషయం మరొకటి ఉండదు. తాను మంచి వాడ్ననీ ఇతరులే తప్పులు చేశారని వారి మీద తోసేసే వ్యూహంలో విజయసాయిరెడ్డి కీలకపాత్ర పోషిస్తున్నారు.
కోటరీని పంపేసిన తర్వాత విజయసాయిరెడ్డి రీ ఎంట్రీ
వైవీ సుబ్బారెడ్డి కొడుకు, సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు, రాజ్ కసిరెడ్డి వంటి వాళ్ల గురించి విజయసాయిరెడ్డి కీలక విషయాలు బయట పెడుతున్నారు. అంటే వారందరూ త్వరలోనే జగన్ క్యాంపు నుంచి బయటకు పోనున్నారు. వారిని పంపేసిన తర్వాత విజయసాయిరెడ్డి మళ్లీ రీఎంట్రీ జరుగుతుంది. మరో ఏడాదిలో జగన్ అనుకున్నట్లుగా పార్టీలో ఎకరాల్ని రెడీ చేసుకుని తాను బయటపడే ప్లాన్ ను జగన్ .. విజయసాయి ద్వారా అమలు చేయిస్తున్నారు. అది వర్కవుట్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.