కౌంటింగ్ మేనేజ్మెంట్పై వైసీపీ దృష్టి పెట్టింది. చిత్తూరు జిల్లా కలెక్టర్, పరిటాల శ్రీరామ్ పోటీ చేసిన రాఫ్తాడు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులపై విజయసాయిరెడ్డి…ఢిల్లీకి వెళ్లిన ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. వారిద్దరూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని వారిద్దరిని కౌంటింగ్ విధుల నుంచి తప్పించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఇప్పటి వరకూ..వైసీపీ..ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదులపై.. ఈసీ తీసుకున్న నిర్ణయాలను చూస్తే..రేపోమాపో వీరిద్దర్ని కూడా… ఎన్నికల విధుల నుంచి తప్పించే అవకాశం ఉందన్న ప్రచారం ఊపందుకుంటోంది. చిత్తూరు జిల్లాలో ఇప్పటికే అసాధారణ రీతిలోరీపోలింగ్ సైతం పెట్టించుకున్న వైసీపీ నేతలు.. ఇప్పుడు నేరుగా కలెక్టర్‌నే టార్గెట్ చేశారు.
నిజానికి.. రెండు రోజుల నుంచి కలెక్టర్ ను.. బదిలీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ లోపు వైసీపీ నేతలే ఫిర్యాదు తీసుకెళ్లి నేరుగా..ఫిర్యాదు చేసివచ్చారు. దాంతో ఈసీ నిర్ణయమే ఆలస్యం అన్నట్లుగా ఉంది. ఇక రాప్తాడు నియోజకవర్గం అత్యంత సున్నితమైనది. అక్కడ రిటర్నింగ్ అధికారిపై వ్యూహాత్మకంగానే… వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కౌంటింగ్ విషయంలో గందరగోళం ఏర్పడే ప్రమాదం ఉందని…భద్రత కారణాలనీ..చెప్పి.. ఆయనను తప్పిస్తే.. అధికార వర్గాలపై ఒత్తిడి తేవొచ్చని..వైసీపీ వర్గాలు. అంచనాలకు వచ్చినట్లు భావిస్తున్నారు. అంతే కాకుండా కౌంటింగ్ రోజు టీడీపీ అలజడులు సృష్టించే అవకాశం ఉందని కేంద్ర బలగాలను మోహరించాలని..విజయసాయిరెడ్డి కోరారు.
వైసీపీ నేతలు ఇటీవలి కాలంలో ఆషామాషీగా ఫిర్యాదులు చేయడం లేదు. ముందుగా మాట్లాడుకున్నట్లుగా.. నిర్ణయాలు వస్తాయని.. తేల్చుకున్న తర్వాతే ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పుడు కౌంటింగ్ కు ఇద్దరు అధికారుల్ని దూరం చేసేందుకు స్కెచ్ వేశారు. మరి ఈసీ ఎప్పట్లాగే జీ హూజూర్ అంటుందో…లేక.. ఎవరేమనుకుంటే మాకెందుకు.., మా పద్దతి మాదేనని అనుకుంటారో.. ఒకటి రెండు రోజుల్లో తేలిపోనుంది.