విజయసాయిరెడ్డి స్టైలే వేరు. ఎవరికైనా కీలక పదవి లభించబోతోందని తెలిసిన వెంటనే వెళ్లిపోయి వారికి శాలువా కప్పి.. ఏదో బహుమతి ఇచ్చి .. కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకుని రావడం ఆయన శైలి. ఇప్పుడు ఆయన ఢిల్లీలో బిజీగా గడుతున్నారు. బీజేపీ తరపున రాష్ట్రపతి అభ్యర్థి.. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరు అవుతారో.. ఓ పేరు లీక్ కాగానే .. వెంటనే వారింటి వద్ద దిగిపోతున్నారు. శాలువా కప్పి పరిచాయాలు పెంచుకుంటున్నారు.
బీజేపీ తరపున రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతి అభ్యర్థి ముక్తార్ అబ్బాస్ నక్వీని ఎంపిక చేస్తారని రెండు రోజులుగా ఢిల్లీ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రవక్తపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలతో అంతర్జాతీయంగా ఏర్పడిన డ్యామేజ్‌ను కవర్ చేసుకునేందుకు ముస్లిం అభ్యర్థికి కీలక పదవి ఇస్తారని అంటున్నారు. అంతే వెంటనే విజయసాయిరెడ్డి అలర్ట్ అయిపోయారు. ముక్తార్ అబ్బాస్ నక్వీకి శాలువా కప్పేసి వచ్చారు. ఏపీలో అమలవుతున్న పథకాల గురించి మాట్లాడుకున్నామని మొహమాటంగా చెప్పుకున్నారు.
అంతకు ముందు మాజీ ఎంపీ ..తృణమూల్ మాజీ నేత..బీజేపీకి దగ్గరగా ఉంటున్న రాజీవ్ త్రివేదిని కలిశారు. వాళ్లు చెబితేనే బయటకు తెలుస్తోంది. ఇంకా చాలా మందితో విజయసాయిరెడ్డి భేటీ అవుతున్నారని.. ఎందుకైనా మంచిదని.. శాలువా కప్పి వస్తున్నారని అంటున్నారు. గతంలో కూడా అంతే. విజయసాయిెడ్డి … కొత్తగా కీలక పదవుల్లోకి వచ్చే వారి గుడ్ లుక్స్‌లో ఉండేందుకు పడాల్సిన తపనంతా పడుతున్నారు. మరి అలా చేయకపోతే.. ఇన్ని సీరియస్ కేసులు పెట్టుకుని కూడా బయట ప్రశాంతంగా ఉండటం కష్టమేనని ఇతర పార్టీల నేతలు సెటైర్లు వేస్తున్నారు.