వాలంటీర్లను, సచివాలయ సిబ్బందిని అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్లుగా ఓటర్ల జాబితాను మార్చేస్తున్న వైసీపీ సర్కార్ నిర్వాకం సంచలనం సృష్టిస్తూంటే. రివర్స్ లో టీడీపీపై ఈసీకి ఫిర్యాదు చేశారు విజయసాయిరెడ్డి బృందం. టీడీపీ ఎలా ఓట్ల అక్రమాలకు పాల్పడుతుందో వివరించారు. అయితే.. విజయసాయిరెడ్డి చెప్పినది చూస్తే.. వైసీపీ ఏం చేస్తుందో చెప్పినట్లుగా ఉందని ఎవరికైనా అనిపిస్తుంది. టీడీపీ నేతలు ఏపీలో 40,76,580 దొంగ ఓట్లు ఓటర్ జాబితాలో చేర్పించారని ఫిర్యాదు చేశారు. ఒకే ఫోటోతో ఇంటి పేరు మార్చి పలు ప్రాంతాలలో ఓటరులుగా టీడీపీ సానుభూతిపరుల పేర్లు నమోదయ్యాయని చెప్పారు.
హైదరాబాద్ , కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలలో నివసిస్తున్న టీడీపీ సానుభూతిపరుల ఓట్లు ఏపీలో కూడా టీడీపీ నేతలు నమోదు చేయించారని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుల ఓటర్లు తొలగించేందుకు ఫారం -7 దరఖాస్తులు బీఎల్వోలకు టీడీపీ నేతలు సమర్పిస్తున్నారని తెలిపారు. నిజానికి ఇవన్నీ చేసింది వైసీపీనే. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే లక్షల కొద్దీ ఫామ్ సెవన్ లో పెట్టించి దొరికిపోయారు. వారు అధికారంలో ఉండటంతో ఇప్పుడు వారే ఫామ్ 7లు పెట్టి వారే ఓట్ల తొలగిస్తున్నారు. ఇక వాలంటీర్ల ద్వారా తాము సమాచారాన్ని సేకరిస్తున్న వైనాన్ని కాస్త మార్చి.. టీడీపీ అలా సేకరిస్తోందని చెప్పుకొచ్చారు ప్రతి ముఫ్పై ఇళ్లకు ఓ కార్యకర్తను నియమించారని వారి ద్వారా కులాన్ని తెలుసుకోవడం ద్వారా పోలరైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. సమాచారాన్ని సేకరించి న్యూయార్క్ , లండన్ సర్వర్లలో భద్ర పరుస్తున్నారని కూడా చెప్పుకొచ్చారు. బహుశా.. వైసీపీ ఇదే చేస్తూండవచ్చని సెటైర్లు వినిపిస్తున్నాయి. ఇలా వాలంటీర్లు ప్రజల ప్రతి సమాచారాన్ని సేకరిస్తున్నారు.
మరో వైపు తాము చేసే ఫిర్యాదుల్నే పరిశలించాలని టీడీపీ వారివివద్దని విజయసాయిరెడ్డి విజ్ఞాపతన పత్రం ఇచ్చారు. టీడీపీ స్టేట్ కోఆర్డినేటర్ సురేష్ కోనేరు ఫిర్యాదులు చేస్తూ టీడీపీ ఎన్నికల సంఘం అధికారుల సమయాన్ని వృధా చేసేలా తప్పుడు ఫిర్యాదులు ఇస్తున్నారని సురేష్ కోనేరు వంటి వ్యక్తులు ఇచ్చే బల్క్ ఫిర్యాదులపై సమయం వృధా చేసుకోవద్దని విజయసాయిరెడ్డి సూచించారు. విజయసాయిరెడ్డి తీరు చూసి ఎన్నికల అధికారులు కూడా ఆశ్చర్యపోయి ఉంటారు.