ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఎన్నో ప్రాజెక్టులు..నిధులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రత్యేకహోదా అంశం వైసీపీఎంపీలకు ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటారు ప్రజలు. కానీ పార్లమెంట్లో ఎప్పుడూ.. ప్రజా సమస్యలపై కానీ.. రాష్ట్ర సమస్యలపై కానీ పోరాడిన దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు అనూహ్యంగా విజయసాయిరెడ్డి పార్లమెంట్‌ను స్తంభింప చేస్తామని ప్రకటించారు. దీంతో చాలా మంది ప్రత్యేకహోదా కోసం రంగంలోకి దిగుతున్నారేమో అనుకుంటారు.. కానీ అసలు విషయం అది కాదు. కనీసం.. ఆయన ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన సమస్యలపైనా లేదా.. ప్రజాసమస్యలపైనా పార్లమెంట్‌ను స్తంభింపచేస్తామని చెప్పడం లేదు.
రఘురామకృష్ణరాజుపై అనర్హతా వేటు వేయాలని డిమాండ్ చేస్తూ.. పార్లమెంట్‌ను స్తంభింపచేస్తారట. మరోసారి స్పీకర్ ఓంబిర్లాను కలిసి.. రఘురామపై అనర్హతా వేటు వేయాలని విజయసాయిరెడ్డి నేతృత్వంలోని ఎంపీలు డిమాండ్ చేశారు. అయితే ఆయన నుంచి సానుకూల స్పందన రాలేదేమో కానీ .. ఆరోపణలు ప్రారంభించారు. ఆయన సీరియస్‌గా లేరని.. ఎందుకో తెలియడం లేదని చెప్పుకొచ్చారు. అదే సమయంలో.. అనర్హతా వేటు వేయకపోతే.. పార్లమెంట్‌ను స్తంభించేస్తామని హెచ్చరించారు.
విజయసాయిరెడ్డి ప్రకటన వైరల్ అవుతోంది. సొంత ఎంపీపై అనర్హతా వేటు కోసం.. పార్లమెంట్ స్తంభన లాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న విజయసాయిరెడ్డి… నమ్మి ఓట్లేసిన ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి.. స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపడానికి పార్లమెంట్‌ను స్తంభింపచేస్తామని ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నిస్తున్నారు. అయినా ఇలాంటి వాటిని విజయసాయిరెడ్డి పట్టించుకోరు. ఒక వేళ ఎవరైనా పట్టించుకున్నా.. వారిపై ట్విట్టర్లో అసభ్యంగా తిట్టి.. సైలెంట్ చేయడానికి ప్రయత్నిస్తారు.