తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈసీని టార్గెట్ చేసుకుంటూడటంతో… ప్రతిపక్ష వైసీపీ … తాము ఈసీకి అండగా నిలవాలని నిర్ణయించుకుంది. ఏపీలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై.. చంద్రబాబు.. ఈసీ విశ్వసనీయతను ప్రశ్నిస్తూ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న సమయంలో.. పని గట్టుకుని మరీ.. వైసీపీ బృందం… ఢిల్లీకి వెళ్లింది. టీడీపీ అరాచకాలకు పాల్పడుతోందని.. కొన్ని ఆరోపణలతో … ఫిర్యాదు చేశారు. అంత వరకూ బాగానే ఉన్నా.. బయటకు వచ్చిన తర్వాత మాత్రం.. అచ్చంగా.. ఈసీకి అధికార ప్రతినిధుల్లా మాట్లాడారు. ఈసీ భేష్ అంటూ.. గతంలోనే సర్టిఫికెట్ పంపారు. ఇప్పుడు నేరుగా కలిశారు. బయటకు వచ్చి.. అంత కన్నా బీభత్సంగా పొగిడేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నిర్వహణ విషయంలో ఏర్పడిన ఇబ్బందుల విషయంలో.. ఎన్నికల సంఘానికి ఎలాంటి తప్పూ లేదని.. ప్రకటించారు. ఓటింగ్ మిషన్లు పనిచేయకపోవడం వల్లే.. అర్థరాత్రి వరకు సమయం పొడిగించారని విజయసాయిరెడ్డి సమర్థించారు. ఓటింగ్ మిషన్లు మొరాయించడం.. మహిళలు గంటల తరబడి క్యూలో నిరీక్షించడం.. ఈసీ వైఫల్యం కానే కాదని స్పష్టం చేశారు. పైగా.. ఈ తప్పు.. రాష్ట్ర ప్రభుత్వానిదని చెప్పుకొచ్చారు. ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్నవారిని ఎన్నికల నిర్వహణకు వాడారన్నారు. 130 స్థానాలు గెలుస్తాం అని చంద్రబాబు చెప్పే మాటలకు..30 శాతం ప్రజలు ఓటు వేయలేదంటున్న వ్యాఖ్యలకు పొంతనలేదని విమర్శించారు. వైసీపీ గెలుపు ఖాయమని ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయని ప్రకటించారు. ఢిల్లీలో చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని.. జాతీయ నేతలు.. చంద్రబాబు మాటలను నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
పోలింగ్ రోజు జరిగిన హింస మొత్తం.. టీడీపీ నేతలు చేసిందేనని విజయసాయిరెడ్డి తేల్చారు. పలుచోట్ల టీడీపీ నేతలు హింసకు పాల్పడ్డారని ఆరోపించారు. కోడెల పోలింగ్ బూత్‌లోకి వెళ్లి అక్రమాలు చేశారని… సానుభూతి కోసం కోడెల తానే చొక్కా చించుకున్నారని తేల్చారు. బాబు తొత్తులు ఎస్పీలుగా ఉన్నచోట్లే హింస జరిగిందని ఆరోపించారు. టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందన్నారు. స్ట్రాంగ్ రూముల వద్ద భద్రత పెంచాలని కోరారు. మొత్తానికి… ఎన్నికల నిర్వహణ తీరుపై.. వెల్లువలా వస్తున్న విమర్శలకు.. వైసీపీ నేతలు… సమాధానాలిస్తున్నారు. ఈసీని సమర్థించేందుకు వెనుకాడటం లేదు. ఈ పరిణామాలతో.. ఈసీపై మరిన్ని అనుమానాలు కలిగేలా చేస్తున్నారు.