వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెంబర్ టూ విజయసాయిరెడ్డికి జగన్మోహన్ రెడ్డి… షాక్ ఇచ్చారు. ఆయనకు.. ఇచ్చిన పదవిని.. ఉన్న పళంగా పీకేశారు. ఏపీ సర్కార్ తరపున ఢిల్లీలో ప్రతినిధిగా వ్యవహరించడానికి.. విజయసాయిరెడ్డికి.. జగన్ అధికారం ఇచ్చారు. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమించారు. ఈ మేరకు గత నెల 22వ తేదీన జీవో నెంబర్ 68ని రిలీజ్ చేశారు. అయితే హఠాత్తుగా.. ఏపీ సర్కార్ ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా విజయసాయిరెడ్డిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీవో 68ని ఉపసంహరించుకుంది. విజయసాయిరెడ్డికి ఎంపీ పదవి ఉన్నందున.. నియామకాన్ని వెనక్కు తీసుకుంటున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. విజయసాయిరెడ్డి స్థానంలో మరొకరిని నియమిస్తామని తెలిపింది.
అయితే విజయసాయిరెడ్డిని ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమించేటప్పుడు.. కూడా ఆయనకు ఎంపీ పదవి ఉంది. అయినప్పటికీ.. పదవి ఇచ్చారు. ఇప్పుడు.. కొత్తగా పదవి ఉందన్న కారణంగా విజయసాయిరెడ్డిని తొలగించడం ఏమిటన్నది చాలా మందికి అంతు బట్టని విషయం. పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుందేమోనని… భయపడటానికి… ఇవేమీ వ్యక్తిగత సేవల కిందకు రావు. నిబంధనలు అంగీకరించకపోవడానికి కూడా అవకాశం లేదు. ఏపీ సర్కార్.. తన ప్రతినిధిగా.. ఢిల్లీలో ఎవరినైనా నియమించుకోవచ్చు. ఎంపీ పదవి ఉండకూడదనే రూలేమీ ప్రత్యేకంగా లేదు. అది ప్రభుత్వ ఇష్టం.
అయితే.. పార్టీ నేతలకు.. పదవులు కల్పించడానికి.. ఇలాంటి పదవులతో భర్తీ చేస్తారు. ఢిల్లీలో మంచి సంబంధాలు ఉన్న నేతలకు అవకాశం ఇస్తారు. వైసీపీకి సంబంధించినంత వరకు.. విజయసాయిరెడ్డికి ఢిల్లీలో ఉన్నన్ని పరిచయాలు మరెవరికీ లేవు. అయినా కానీ.. హడావుడిగా… నియామకం జరిపిన సర్కార్.. అంతే హడావుడిగా.. వెనక్కి తీసుకుంది. విజయసాయిరెడ్డికి పదవిని ఊడబీకడంలో.. జగన్ ఉద్దేశమేమిటో కానీ.. వైసీపీలో మాత్రం ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.