విజయసాయిరెడ్డి పేరు మీద ఉండే ట్విట్టర్ హ్యాండిల్ ఆయన డీల్ చేయరని అందరికీ తెలుసు. అయనకు తెలియకుండా ట్వీట్లు పెడతారనిఎవరూ అనుకోరు. పెట్టే ప్రతి ట్వీట్‌కు ఆయన అనుమతి ఉంటుంది. అందులో సందేహం లేదు. పచ్చి బూతులతో ఉండే ట్వీట్లను చాలా సార్లు పెట్టారు. ఇప్పుడు కొత్తగా అసలేం పెడుతున్నారో అర్థం కాని ట్వీట్లు పెడుతున్నారు. 90 శాతం తెలుగు వాళ్లకి తెలియని హిందీలో ట్వీట్లు చేస్తున్నారు.
వాతావరణం బాగా లేదు.. దోమలెక్కున్నాయి.. జాగ్రత్తలు తీసుకోండి అనే సలహాలను హిందీలో పెట్టారు. పోనీ పవన్ కల్యాణ్‌లాగా.. హిందీతో పాటు తెలుగులోనూ పెడుతున్నారా అంటే అదీ లేదు. కేవలం హిందీలోనే ఆ ట్వీట్ ఉంది. ఏదో పొరపాటున పెట్టారని అనుకోవడానికిలేదు మళ్లీ చంద్రబాబును విమర్శించడానికి కూడా హిందీ భాషనేవాడుకున్నారు. ఇండియాను శ్రీలంక ఆర్థిక వ్యవస్థతో పోల్చడం కరెక్ట్ కాదని నీతిఆయోగ్ మాజీ సీఈవో అన్నారని ఆయనపేరుతో చంద్రబాబును తిడుతూఓ ట్వీట్ చేశారు.
ఇదీతెలుగులో లేదు. హిందీలోనే ఉంది. విజయసాయిరెడ్డి ఈ హిందీ ట్వీట్లేమిటబ్బా అని వైసీపీ నేతలు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఆయన ట్విట్టర్ హ్యాండిల్ చేస్తున్న ఏజెన్సీ.. హిందీ వాళ్లకు మెయిన్టనెన్స్కు ఇచ్చినట్లుందని వాళ్లకి తెలుగు తెలియక… హిందీలో ట్వీట్లు చేసేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. వైసీపీ సోషల్ మీడియాను నడిపే విజయసాయిరెడ్డి తన ట్విట్టర్ హ్యాండిల్‌ను ఎందుకు సరి చూసుకోవడం లేదనేది ఎక్కువమందికి వస్తున్న డౌట్.