విజయసాయిరెడ్డి లీలలు బయటకు వచ్చే కొద్దీ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. మూడురోజుల కిందట శాంతి అనే దేవాదాయశాఖ ఉద్యోగిని భర్త లోకేష్ ను కలిసి .. తన భార్యకు పుట్టిన బిడ్డకు విజయసాయిరెడ్డినే తండ్రి అని డీఎన్ఏ టెస్టులు చేయించాలని కోరారు. ఈ విషయంలో గతంలోనే దుమారం రేగింది. తాజాగా విజయసాయి రెడ్డి ఆ శాంతి అనే ఉద్యోగిని చెల్లెళ్లే బాధ్యతలు కూడా తీసుకున్నారని తేలింది.
శాంతికి ఇద్దరు చెల్లెళ్లకే ఏపీ ఫైబర్ నెట్ లో ఉద్యోగాలు ఇప్పించారు. కనీసం నియామక పత్రాలు కూడా లేవు. వాట్సాప్ మెసెజ్ తో ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగాలిచ్చి వారికి ప్రజాధం జీతాలుగా దోచి పెట్టారు. ప్రభుత్వం పోయేదాకా ఉన్నారు. వారితో కలిసి చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టడానికి ఫైళ్లను ట్యాంపరింగ్ చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. అయినా విజయసాయిరెడ్డి .. ఆ శాంతిని.. ఆమె చెల్లెళ్లను ఇంత బాగా చూసుకోవడానికి కారణం ఏమిటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
విజయసాయిరెడ్డిపై వచ్చిన ఆరోపణలు చిన్నవి కావు. తల్లి అనుమతి లేకుండా డీఎన్ఏ టెస్టులు చేయలేకపోవచ్చు కానీ.. తండ్రి న్యాయపరంగా పోరాడితే మాత్రం.. సాధ్యం కావొచ్చు. శాంతి భర్త ఇప్పుడు ఆ ప్రయత్నంలోనే ఉన్నారు. విజయసాయిరెడ్డి శాంతిని తన కూతురుగా భావించి ఆదరించానని చెబుతూ వస్తున్నారు. ఎదురుదాడి చేస్తున్నారు.కానీ ఆ భర్త అనుమానాల్ని తీర్చాల్సి ఉంది కదా. ఇప్పుడు ఆ శాంతి చెల్లెళ్లకూ ఆయన ఉద్యోగాలిప్పించినట్లుగా బయటపడింది.