వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి… పీఎంవోలో చాలా పలుకుబడి ఉంది. ఆ విషయంలో గతంలోనే వెల్లడయింది. తాజాగా ఎన్నికల కోడ్ ఉన్న సమయంలోనూ.. మరోసారి… విజయసాయిరెడ్డి తన పవర్ చూపించారు. అదీ కూడా.. ఏపీకి సంబంధించి కాదు. ఉత్తరాదికి చెందిన ఓ పవర్ ప్రాజెక్ట్ కు సంబంధించి…తన ప్రతాపాన్ని చూపించారు. ఉత్తరాఖండ్‌లో తెహ్రీ డ్యామ్ మీద.. కోటేశ్వర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఉంది. ఆ కంపెనీ అవకతవలకు పాల్పడిందని…దానిపై చర్యలు తీసుకోవాలంటూ… విజయసాయిరెడ్డి ప్రధానమంత్రి కార్యాలయానికి ఓ లేఖ రాశారు. నేరుగా సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విజయసాయిరెడ్డి లేఖ రాయడమే ఆలస్యం.. వెంటనే… కేంద్ర ప్రభుత్వం కూడా.. కోడ్ అడ్డంకుల్లాంటివేమీ పట్టించుకోకుండా… ఉత్తరాఖండ్ చీఫ్ సెక్రటరీకి ఓ లేఖ పంపింది. అర్జంట్‌గా… విజయసాయిరెడ్డి చెప్పిన… కోటేశ్వర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ పై విచారణ జరపాలని ఆదేశించారు. విజయసాయిరెడ్డి.. ఫిర్యాదు చేసిన కంపెనీ..విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి.. డైరక్టర్, మేనేజింగ్ డైరక్టర్లంతా ఉత్తరాది వాళ్లే ఉన్నారు.
ఈ విషయం గోప్యంగా ఉంచినప్పటికీ.. బయటకు వచ్చింది. అసలు విజయసాయిరెడ్డికి… ఉత్తరాఖండ్ లో ఉన్న విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధం ఏమిటి..? ఆ ప్రాజెక్టులో అవకతవకలపై.. ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఏమిటన్నది.. ఇప్పుడు… చర్చనీయాంశం అవుతోంది. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో… ఉత్తరాఖండ్‌లో జగన్.. పలు పవర్ ప్రాజెక్టులు బినామీ పేర్లతో పెట్టారన్న ప్రచారం జరిగింది. అయితే దేనికీ ఆధారాల్లేవు. కొంత మంది ఏపీ పారిశ్రామికవేత్తలు.. అప్పట్లో.. పెద్ద ఎత్తున విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టారు. వాటి సంగతేమో కానీ.. ఇప్పుడు నేరుగా విజయసాయిరెడ్డి.. ఓ పవర్ ప్రాజెక్ట్ పై ఫిర్యాదు చేయడం..నేరుగా..సీబీఐ విచారణ కోరడం కలకలం రేపుతోంది. ఏ ఏ అంశాలపై…ఫిర్యాదులు చేశారో కానీ… మొత్తానికి.. ఉత్తరాఖండ్ పవర్ ప్రాజెక్టులకు… విజయసాయిరెడ్డి, జగన్‌లకు లింక్ ఉందన్న అనుమానం మాత్రం తాజా ఫిర్యాదులతో వస్తోంది.
బినామీల ద్వారా పవర్ ప్రాజెక్ట్ పెట్టించిన తర్వాత.. సదరు కంపెనీ నిర్వాహకులు… జగన్ అండ్ కోకు హ్యాండిచ్చారేమోనని.. అందుకే ఆగ్రహంతో.. పీఎంవోలో తనకు ఉన్న పలుకుబడితో..విచారణ జరిపించేలా చేసుకున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో..కొద్ది రోజుల కిందట..స్విట్జర్లాండ్ టూర్‌కు వెళ్తున్నానని చెప్పి బయలుదేరి వెళ్లిన జగన్…చండీగఢ్ దగ్గర ఓ రిసార్టులో ఉండి వచ్చారని వైసీపీ వర్గాలు తర్వాత చెప్పాయి. ఈ పవర్ ప్రాజెక్టుల లావాదేవీల గురించే.. అక్కడ చర్చలు జరిగి ఉంటాయన్న అనుమానాలు కూడా ప్రారంభమయ్యాయి. మొత్తానికి విజయసాయిరెడ్డి… కోటేశ్వర్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పై.. ఎందుకు కోపం వచ్చిందో బయటపడితే.. అసలు గుట్టు బయటపడే అవకాశం ఉంది.