గత కొంతకాలంగా రాజకీయ తెరపై ఎలాంటి పాత్ర పోషించాలో తెలియకుండా గందరగోళం లో ఉన్నట్టు కనిపించిన రాములమ్మ… చివరికి తన గమ్యాన్ని ఖాయం చేసుకున్నారు.
అవును… అనుకున్నట్టుగానే మాజీ సినీనటి… విజయశాంతి కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి తో కలిసి ఆమె రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి కుంతియాతో భేటి అయ్యారు. ఆదివారం జరిగిన ఈ భేటీలో విజయశాంతి కాంగ్రెసులో చేరడం దాదాపు ఖరారైoది. ప్రస్తుతం ఉన్న పరిస్థితి లో కాంగ్రెస్ తప్ప వేరే ప్రత్యామ్నాయ పార్టీలో ఆమె చేరే అవకాశం లేదని విశ్లేషకులు భావించారు. ఇప్పుడు అదే నిజమైంది.
విజయశాంతి మాత్రమే కాదని మరెందరో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఉత్తమ్ అంటున్నారు. టి ఆర్ ఎస్, బీజేపీ, కాంగ్రెస్… ఇలా పలు పార్టీల మధ్య చక్కర్లు కొట్టిన ఈ మాజీ లేడీ అమితాబ్ కు సంబంధించి ఇదే రాజకీయ తుది మజిలీ అని అనుకోవచ్చు.