తెలంగాణ బీజేపీలో పుట్టి పెరిగిన వారు తప్ప మధ్యచేరిన వారందరిపైనా పార్టీ మార్పు ప్రచారాలు వస్తున్నాయి. తాజాగా విజయశాంతిపైనా అలాంటి రూమర్సే గుప్పుమటున్నాయి. నిజానికి ఇవి ఈ ప్రచారాలు ఎప్పుడూ జరిగేవే. కానీ విజయశాంతి మాత్రం కొత్తగా స్పందించారు. రెండు రోజుల నుండీ రాములమ్మ బీజేపీ పార్టీతో దూరమవుతున్నారు. పార్టీతో అభిప్రాయభేదాలు ఉన్నవని సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నది. ఇది సరైనదో కాదో ప్రచారం చేసేటోళ్లకు తెలియాలని చెప్పుకొచ్చారు. తాను మాత్రం మహాశివుని కాశీ మహాపుణ్యక్షేత్రం, *”గరళకంఠుని”* సన్నిధానంలో ఉన్నానని సోషల్ మీడియాలో చెప్పుకున్నారు.
తాను పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తలను ఆమె ఖండించలేదు. ప్రచారం చేసే వారికే తెలియాలంటూ కొత్త వాదన వినిపించారు. గతేడాది అక్టోబరులో కూడా విజయశాంతి పార్టీ మారతారని ఇలాంటి ప్రచారమే జరిగింది. బండి సంజయ్ తనను పట్టించుకోవడం లేదని ఫీలయ్యారు. తర్వాత సర్దుకున్నారు. తెలంగాణ బీజేపీలో తాను పనిచేసుకోవడానికి ఇబ్బంది అయితే బీజేపీలోనే అనేక దక్షిణాది, మరికొన్ని ఇతర రాష్ట్రాలు ఉన్నాయి. బీజేపీ నుండి వీడిపోవాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. ఇటీవలి కాలంలో ఆమెను రాష్ట్ర నేతగా బండి సంజయ్ గుర్తించడం లేదు.
కొన్ని కార్యక్రమాలకే పిలుస్తున్నారు. పైగా ఇప్పుడు అంతా బీజేపీ నుచి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఆమె కూడా ప్రచారంలోకి వచ్చింది. సందర్భం, సీజన్ ను బట్టీ పార్టీ మారడంలో విజయశాంతి చురుకుగా ఉంటారు. ఇప్పటికి బీజేపీలో మూడు సార్లు.. కాంగ్రెస్ లోకి రెండు సార్లు ఎంట్రీ ఇచ్చారు. మరోసారి కాంగ్రెస్ లోకి వెళ్లినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది. ఇలా చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే రేపేమైనా జరుగుతోందన్న అభిప్రాయం ఎక్కువ మందిలో వినిపిస్తోంది.