తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న విజయశాంతి ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారనే ప్రచారం కొద్ది రోజులుగా సాగుతోంది. మాజీ ఎంపీలను బరిలోకి దించాలనుకుంటున్న కాంగ్రెస్ హైకమాండ్.. ఆ జాబితాలో విజయశాంతిని కూడా చేర్చారని ఆపార్టీ నేతలు చెప్పుకొచ్చారు. మొదట దుబ్బాక.. ఆ తర్వాత మెదక్ అసెంబ్లీ సీట్లను… రాములమ్మ ఖాతాలోవేశారు. నిజానికి విజయశాంతి.. పోటీ చేయాలనే ఉద్దేశంలో లేరు. ఎన్నికల ముందు.. తాను ప్రచారం మాత్రమే చేస్తానని చెప్పుకొచ్చారు. కానీ మహాకూమిట గెలిచే వాతావరణం కనిపించడంతో.. పోటీకి సిద్ధమైనట్లు ప్రచారం జరగింది.
ఉమ్మడి మెదక్ జిల్లా దుబ్బాక నియోజకవర్గం నుంచి ఎన్నికల కదన రంగంలోకి దూకాలని రాములమ్మ నిర్ణయించుకున్నారని కాంగ్రెస్ హైకమాండ్‌కు తన అభిప్రాయం చెప్పారని… ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని కూడా.. మీడియాకు సమాచారం ఇచ్చారు. మెదక్, దుబ్బాకలను… ఈ సారి.. మహాకూటమిలో భాగంగా.. తెలంగాణ జన సమితికి ఇస్తున్నారని ఆ సమయంలో ప్రచారం జరిగింది. అందుకే.. ఆ రెండు స్థానాలు టీజేఎస్‌కు ఇస్తే ఓడిపోతుందని.. కాంగ్రెస్సే పోటీ చేయాలనే వాదన వినిపిస్తూ మీడియాకు లేఖలు కూడా రాశారు. కానీ రెండు సీట్లు జనసమితి ఖాతాలోనే పడినట్లు తాజా అప్ డేట్. దాంతో… విజయశాంతికి కాంగ్రెస్ టిక్కెట్ నిరాకరించిందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని విజయశాంతి ఖండించారు. సీటు కేటాయించలేదనడం అవాస్తవమంటున్నారు. పోటీ చేయాలని పార్టీ కోరినా ప్రచార బాధ్యతలు ఉండటం వల్ల నేనే పోటీ చేయడం లేదని చెబుతున్నారు.
ఆమె టీఆర్ఎస్లో ఉన్నప్పుడు.. మెదక్ ఎంపీగా గెలిచారు. ప్రజలకు అందుబాటులో ఉన్నారా.. అంటే.. నూటికి 90 శాతం లేరనే చెబుతారు. గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. కానీ.. అక్కడి ప్రజలు విజయశాంతిని పరిగణనలోకి కూడా తీసుకోలేదు. దాంతో ఆమె ఆ తర్వాత ఎవరికీ కనిపించకుండా పోయారు. మళ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలో ప్రత్యక్షమయ్యారు. ప్రచారంలో ఆమెను పట్టించుకుంటున్న వాళ్లు కూడా లేరు. ఇప్పుడు పోటీ చేద్దామంటే చాన్స్ రాలేదు…కాబట్టి వచ్చే ఎన్నికల తర్వతా కనబడతారా లేదా..అన్న సందేహాలకు పులిస్టాప్ పెట్టవచ్చు.