కాంగ్రెస్ లో కొనసాగుతూ బీఆర్ఎస్ కు మద్దతుగా విజయశాంతి బీజేపీకి కౌంటర్ ఇవ్వడం చర్చనీయాంశం అవుతోంది. ఇక బీఆర్ఎస్ ఉనికి ఉండదని కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ ఆమె చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపింది.
దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే స్థానిక ప్రజల మనోభావాలను అర్థం చేసుకుంటాయని బీఆర్ఎస్ పట్ల సానుకూల దృక్పథంతో రాములమ్మ తాజాగా ట్వీట్ చశారు. దక్షిణాదికి ప్రాంతీయ పార్టీలే ఊపిరి అని, ఇది అర్థం చేసుకోకుండా వ్యవహరిస్తోన్న వారికి కరుణానిధి, ఎంజీఆర్, ఎన్టీఆర్, రామకృష్ణ హెగ్డే, జయలలితల నుంచి ఇప్పుడున్న బీఆర్ఎస్ , వైసీపీలే సమాధానం అన్నారు. దీనిపై బీజేపీ విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ కౌంటర్ ఇచ్చారు విజయశాంతి.
దక్షిణాది విషయాల్లో కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు బీజేపీ ఆలోచించడం లేదన్నారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలే ఇందుకు ఉదాహరణ అని పేర్కొనడటంతో విజయశాంతి ట్వీట్ పై పొలిటికల్ సర్కిల్లో కొత్త చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ లో కొనసాగుతూ ప్రాంతీయ పార్టీలను ముఖ్యంగా బీఆర్ఎస్ పట్ల సానుకూల వైఖరితో మాట్లడటంపై ఆమె కాంగ్రెస్ ను వీడి కారెక్కనున్నారా..? అనే ప్రచారం జరుగుతోంది.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి అప్పటి నుంచి సైలెంట్ గానే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీ సీటు ఆశించారని కానీ, ఆమెకు టికెట్ నిరాకరించడంతో పార్టీపై ఆసంతృప్తిగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆమె చేసిన ట్వీట్ రాములమ్మ తిరిగి గులాబీ గూటికి చేరనుందా..? అనే సందేహాలకు బలం చేకూర్చేలా ఉందంటున్నారు విశ్లేషకులు.
https://x.com/vijayashanthi_m/status/1791290840863932726