కెసిఆర్ 50 వేల ఉద్యోగాల భర్తీ ప్రకటన వెనుక కుట్ర: విజయశాంతి

నీళ్లు నిధులు నియామకాలు అన్న అంశం పైన తెలంగాణ ఉద్యమం నిర్మించబడిందని, తెలంగాణ ఉద్యమం లో యువత ఉత్సాహం గా పాల్గొనడానికి రాష్ట్రం వస్తే ఎక్కువగా ఉద్యోగాలు వస్తాయన్న ఆశ ఒక కారణమని అందరికి తెలిసిందే. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఆశించిన స్థాయి లో ఉద్యోగాలు రాక పోవడం తో యువత కొంత నిరుత్సాహానికి గురి కావడం , కేసీఆర్ ప్రభుత్వాన్ని ఈ విషయంలో పలు మార్లు విమర్శించడం కూడా తెలిసిందే. తాజాగా కెసిఆర్ 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ అధికారులను ఆదేశించినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇదంతా కేవలం బూటకం అని, ఉప ఎన్నికల్లో లబ్ధి పొందే కుట్ర తో మాత్రమే కెసిఆర్ ఇటు వంటి ప్రకటనలు చేస్తూ కుట్రలకు పాల్పడుతున్నారని బిజెపి నేత విజయ శాంతి విమర్శలు చేశారు. వివరాల్లోకి వెళితే..

విజయ శాంతి ట్వీట్ చేస్తూ, ” తెలంగాణ లో 50 వేల ప్రభుత్వ కొలువులు భర్తీ చేస్తాం అంటూ ఎప్పుడో 7 నెలల కిందట ప్రకటించిన కేసీఆర్ గారికి…. ఉన్నట్టుండి నిరుద్యోగుల పై ప్రేమ పుట్టి వెంటనే కొలువుల భర్తీకి చర్యలంటూ నేడు మళ్ళీ ప్రకటన చేశారనుకుంటే అంత కంటే పిచ్చితనం మరొకటి ఉండదు. ఉద్యోగాలంటూ కేసీఆర్ గారు ఎప్పుడు ప్రకటించినా ఆ వెనుక ఎంతో పకడ్బందీ కుట్ర ఉంటుంది. ఏడు నెలల కిందట చేసిన ఆ 50 వేల ఉద్యోగాల భర్తీ ప్రకటన ను నాన్చి నాన్చి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో అస్త్రం గా వాడుకున్నారు. తమ అభ్యర్థులు గెలిచాక… ఉద్యోగాల భర్తీ ప్రకటన ను ఉఫ్‌మని ఊదేశారు. ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నిక ను దృష్టి లో పెట్టుకుని మళ్ళీ భర్తీ అంటూ బాజాలు మోగిస్తున్నారు. తెలంగాణ లో మూడేళ్ళుగా జాబ్ నోటిఫికేషన్లు లేవు.

అంతకు ముందు కూడా చిన్నా చితకా నోటిఫికేషన్లు తప్ప ఉద్యోగాల భర్తీకి పెద్ద నోటిఫికేషన్లు ఏవీ రాలేదు. ఈ క్రమంలో ఎందరో నిరుద్యోగులకు వయో పరిమితి దాటిపోయి… తమ కలల్ని సాకారం చేసుకునే అవకాశానికి శాశ్వతంగా దూరమై పోయారు. ఇంకెందరో నిరుద్యోగులు ఏజ్ బార్ ప్రమాదానికి దగ్గర పడ్డారు… పడుతున్నారు. తెలంగాణ వచ్చినా సర్కారు కొలువులు దక్కలేదన్న నిరాశ తో పలువురు నిరుద్యోగులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. కేసీఆర్ గారికి నిజం గా ఉద్యోగాల భర్తీ పై అంత చిత్త శుద్ధి ఉంటే ఇలాంటి పరిస్థితి రానిచ్చే వారు కాదు. నిజానికి లక్షా 90 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలుంటే… అందులో ఇప్పుడు తొలి దశ లో 50 వేల ఉద్యోగాల భర్తీ అంటున్నారు. దీనికే ఏళ్ళకు ఏళ్ళ సమయం తీసుకుంటున్నారు. ఇక మిగిలిన లక్షా 40 వేల పై చిలుకు పోస్టు ల భర్తీ కావాలంటే ఆందుకు ఆయన కొడుకు, మనుమలు, ముని మనుమలు కూడా సీఎం లు అయ్యే వరకూ ఎదురు చూడాలేమో !! ” అని రాసుకొచ్చారు.

ఉద్యోగాల భర్తీ అన్నది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ అస్త్రంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో ప్రవేశించిన షర్మిల సైతం ఉద్యోగాల భర్తీ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ ఉండడం, ప్రతిపక్షాలు ఈ అంశాన్ని లేవనెత్తిన ప్రతి సారీ వారికి యువత నుండి నిరుద్యోగుల నుండి మద్దతు లభిస్తుండడం కూడా కెసిఆర్ ఉద్యోగాల భర్తీ పై ఉప ఎన్నికలకు ముందు దృష్టి సారించడానికి ఒక కారణం అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఏది ఏమైనా ఇటు తెలంగాణలోనూ అటు ఆంధ్రప్రదేశ్ లో నూ సంక్షేమ పథకాలు విరివిగా ఉన్నప్పటికీ, సంక్షేమ పథకాల వల్ల యువతకు నేరుగా ప్రయోజనం ఉండకపోవడం, పైగా ఉపాధి కల్పించడం వంటి శాశ్వత చర్యలకు పాల్పడకుండా సంక్షేమ పథకాలతో కాలయాపన చేయడం వంటి వాటి కారణం గా రెండు తెలుగు రాష్ట్రాల లో కూడా యువత ప్రభుత్వాల పై నిరసన వ్యక్తం చేస్తోంది. అయితే తాజాగా తెలంగాణ లో ఉద్యోగాల భర్తీ పై వార్తలు వస్తున్నప్పటికీ, నోటిఫికేషన్లు నిజంగా విడుదల కాకపోవడంతో యువత 50 వేల ఉద్యోగాల భర్తీ వార్తలపై పూర్తిస్థాయిలో విశ్వాసాన్ని వ్యక్తం చేయలేకపోవడం గమనార్హం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మారుతికి ముందే తెలుసా?

రాజ్ తరుణ్ కి హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. రెండు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రాజ్ నుంచి వచ్చాయి. పురుషోత్తముడు, తిరగబడరాస్వామి, భలే ఉన్నాడే. ఈ మూడు ఫ్లాపులే. భలే ఉన్నాడే చాలా...

బంగ్లాని లైట్ తీసుకోవద్దు బాసూ

ఇండియా - బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్ ఈనెల‌ 19 నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో రాబోయే పది టెస్టులు టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్ ప్రాధాన్యతని సంతరించుకుంది....

చిట్‌చాట్‌లతో BRSను చిరాకు పెడుతున్న రేవంత్ !

రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడే మాటలు మీడియాలో హైలెట్ అవుతూంటాయి. వాటిని పట్టుకుని బీఆర్ఎస్ ఆవేశ పడుతోంది . అంతా అయిపోయిన తరవాత తీరిగ్గా.. నేను ఎప్పుడన్నాను అని రేవంత్...

ఢిల్లీ తర్వాత సీఎం కూడా కేజ్రీవాలే ?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు ఢిల్లీ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కొత్త సీఎంగా కేజ్రీవాల్ ఎవరికి చాన్సిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. విచిత్రంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close