తెలంగాణ సాధన కోసం పార్టీ పెట్టి.. తర్వాత ఉద్యమకారిణిలో బీఆర్ఎస్ పార్టీల తర్వాత కాంగ్రెస్ బీజేపీల్లో నాయకురాలిగా వెలిగిన విజయశాంతికి అసలు ప్రత్యేకంగా ఓ నియోజకవర్గం అంటూ లేదు. తన పూర్వికులది ఏటూరు నాగారం అని చెప్పుకుంటారు.. అదీ కూడా ఓసే..రాములమ్మ సినిమా తర్వాతనే. అయినా ఆమె ఎప్పుడూ వరంగల్ జిల్లా వైపు చూడలేదు. తనకు ఓ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని అక్కడే పని చేసుకుందామన్న ఆలోచన చేయలేదు. కానీ ఎన్నికల్లో పోటీకి చాన్సివ్వకపోతే మాత్రం ఫైర్ అయిపోతూ ఉంటారు.
బీఆర్ఎస్ లో చేరాక.. కేసీఆర్ .. అత్యంత సేఫ్ సీటు అయిన మెదక్ ఇచ్చారు. మెదక్ ఎంపీ అయ్యారు. కానీ చివరికి ఆమె బయటకు రావాల్సి వచ్చింది. కాంగ్రెస్ లో చేరారు. అదే మెదక్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఘోరాపరాజయం పాలయ్యారు. మళ్లీ మెదక్ వైపు చూడలేదు. తర్వాత కాంగ్రెస్ లాభం లేదని బీజేపీలో చేరారు. కాంగ్రెస్ లో ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్నారు కానీ.. బీజేపీలో అసలు ఏ పదవీ దక్కలేదు. అసలు నియోజకవర్గమే లేకుండా పోయింది.
వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వాలంటే ఆమెకంటూ ఓ నియోజకవర్గం ఉండాలి కదా అనే సైటెర్లు బీజేపీలోనే వినిపిస్తున్నాయి. అన్నింటికన్నా సేఫ్ నియోజకవర్గం కూకట్ పల్లి అని.. అక్కడైతే.. . ఏ సమస్యా ఉండదని.. అక్కడి టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లుగా బీజేపీ వర్గాలు గుసగుసలాడుతుతున్నాయి. ఆమె కూడాతరచూ కూకట్ పల్లిలో పర్యటిస్తున్నారు. అక్కడ అయినా టిక్కెట్ ఇస్తారో లేదో కానీ… తన నియోజకవర్గం కూకట్ పల్లి అని రాములమ్మ డిసైడయినట్లుగా చెబుతున్నారు.