విజయవాడ ఎయిర్ పోర్టు మళ్లీ రద్దీగా కనిపిస్తోంది. విమాన సర్వీసుల సంఖ్య నెల రోజుల్లోనే పెరిగిపోయింది. కొత్త ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు దేశ విదేశీ ప్రముఖులు తరలి వస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు.. ఇతరఅంశాలపై మాట్లాడేవారే కాదు వ్యాపార వ్యవహారాలు కూడా ఊపందుకోవడంతో… సర్వీసులతో పాటు ప్రత్యేక విమానాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. తాజాగా రద్దీ పెరగడంతో ముంబై, విజయవాడ మధ్య మరో నాన్ స్టాప్ సర్వీస్ ను ఇండిగో ప్రకటించింది.
2014-19 మధ్య గాల్లో చక్కర్లు కొట్టిన విమానాలు తర్వాత ఐదేళ్ల పాటు కనిపించకుండా పోయాయి. విజయవాడకు వచ్చే ప్రముఖులు తగ్గిపోయారు. జగన్ తో పాటు కొంత మంది ఆయన వందిమాగధులు వాడుకునే ప్రైవేటు ఎయిర్ పోర్టుగా మారిపోయింది. 201-19 మధ్య వివిధ నగరాల నుంచి 54 సర్వీసులు రాకపోకలు సాగించేవి. 2014కు ముందు విజయవాడ నుంచి కేవలం 10 విమాన సర్వీసులు మాత్రమే ఇక్కడ్నుంచి నడిచేవి. కానీ నవ్యాంధ్రలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బాగా పెరిగాయి. జగన్ అధికారంలో ఉన్నఐదేళ్లలో అవి ఇరవైకి పడిపోయాయి.
ఇప్పుడు మళ్లీ క్రమంగా ప్రయాణికులు పెరుగుతున్నారు. అమరావతి నిర్మాణం ఊపందుకుంటే మళ్లీ పాత స్థాయిలో రోజుకు యాభైకి పైగా విమానసర్వీసులు రాకపోకలు సాగించే అవకాశం ఉంటుంది.