విజయవాడ ప్రాంతం రియల్ ఎస్టేట్ పరంగా ఎప్పుడూ లేనంత పాజిటివ్ గా కనిపిస్తోందిత గతంతో పోలిస్తే శివారు ప్రాంతాల్లోనే ఎక్కువగా అభివృద్ధి కనిపిస్తోంది. ఇప్పుడు హైదరాబాద్ హైవేపై ఉన్న గొల్లపూడి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గత కొన్నేళ్లుగా గొల్లపూడి విజయవాడలో కలిసిపోయిది. కార్పొరేషన్ తో కలిపి అభివృద్ధి పనులు చేపడుతున్నారు. అయితే ఇటీవలి కాలంలోనే ఇక్కడ మెట్రో సిటీ స్థాయి రియల్ ఎస్టేట్ వ్యవహారాలు నడుస్తున్నాయి.
గొల్లపూడి చుట్టూ కొన్ని వందల వెంచర్లు వెలుస్తున్నాయి. ఇవన్నీ ఇప్పటికిప్పుడు ఇళ్లు కట్టుకునేలా ఉండటమే విశేషం. పెద్ద ఎత్తున అపార్టుమెంట్ల నిర్మాణం జరుగుతోంది. నలభై లక్షల నుంచి అపార్టుమెంట్లు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని మెరుగైన సౌకర్యాలు. ఉన్న లగ్జరీ ఫ్లాట్లు అయితే ఇంకా ఇంకా ఎక్కువధర పలుకుతున్నాయి. గొల్లపూడిలోఇండిపెండెంట్ హౌస్‌లకు కూడా డిమాండ్ ఎక్కువగా ఉంది. కాస్త విశాలమైన స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకుని ఉండాలనుకునేవారికి ఇది మంచి ప్రాంతంగా మారింది. ఇక్కడ గజం యాభై వేల కు లభిస్తోంది. రోడ్డుకు దగ్గరగా ఉన్న స్థలాలుఅయితే ధరలు పెరుగుతూ పోతున్నాయి.
గొల్లపూడి ఇప్పుడు హైదరాబాద్ హైవేపై ఉటుంది. బైపాస్ రోడ్ నిర్మాణంతో గొల్లపూడికి డిమాండ్ మరింతగా పెరిగింది. ఇప్పటికే గొల్లపూచి ప్రాంతం విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోనే ఉంది. అందుకే అమరావతి పనులు ఊపందుకునే కొద్దీ.. గొల్లపూడిలో రియల్ మార్కెట్ మరింత ఊపందుకోనుంది. ఇక్కడ ఇల్లు లేదా స్థలం కొని పెట్టుకున్న వారందరికీ ఊహించని రిటర్న్స్ వస్తాయన్న అభిప్రాయం రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఉంది.