జెత్వానీ కేసులో పోలీసులు బరి తెగింపునకు ఎన్నో ఉదంతాలు బయటపడుతున్నాయి. జెత్వానీపై పెట్టిన తప్పుడు కేసుల వ్యవహారం సంచలనం సృష్టిస్తే ఇందులో వారి నిర్వాకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జెత్వానీ ఫోన్ పాస్ వర్డ్ లు ఎంతకీ చెప్పకపోవడం.. వాటిని ఓపెన్ చేయలేకపోవడంతో ఆమెను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడానికి ఢిల్లీలో ఉన్న ఆమె స్నేహితుడు అమిత్ సింగ్ ను అరెస్టు చేసేందుకు ప్లాన్ చేశారు. అమిత్ సింగ్ వివరాలను విద్యాసాగర్ ఇవ్వడంతో తప్పుడు కేసులు పెట్టారు.
జెత్వానీని అరెస్టు చూపించిన తర్వాత రోజు.. విజయవాడలోని ఓ మణిపూర్ స్పాపై పోలీసులు రెయిడ్ చేశారు. ఆ స్పా నిర్వాహకులైన మణిపూరి మహిళపై వ్యభిచారం కేసు పెట్టారు. విటుడిగా అమిత్ సింగ్ అనే వ్యక్తిని చేశారు. విటుడు అయితే అక్కడే దొరకాలి కదా.. కానీ ఆ విటుడు ఢిల్లీలో ఉన్నాడని అరెస్టుల చేసేందుకు ఢిల్లీ వెళ్లారు. ఇందు కోస స్పాపై రెయిడ్ చేసే ముందు రోజే.. ముందు జాగ్రత్తగా టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. ఢిల్లీ వెళ్లారు కానీ.. ఆ అమిత్ సింగ్ ఎక్కడ ఉంటారో..ఎలా ఉంటారో..తెలియక తిరిగి వచ్చేశారు. కానీ కేసుమాత్రం అలాగే ఉంది. ఇప్పుడు అది వారి మెడకు చుట్టుకుంది.
పోలీసు పవర్స్ ను ఎంత ఘోరంగా తప్పుడు పనులకు వాడుకున్నారో తేలిపోయేలా… వైసీపీ హయాంలో బెజవాడ పోలీసులు వ్యవహరించారు. ఇప్పుడా విషయాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. తెలిసింది గోరంతే.. తెలియాల్సింది కొండంత అన్నట్లుగా ఉంది. ఇలాంటి పనులు చేసిన వీరిని సర్వీస్ నుంచితప్పించడం తప్ప మరో మార్గం లేదనేలా కేసును ఫిక్స్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.