వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. మాజీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మార్చి ఐదో తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఓ పోక్సో కేసులో బాధితురాలి పేర్లను బయట పెట్టడమే కాకుండా అసభ్యంగా మాట్లాడారు. ఈ మాటల వీడియోలతో సహా వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేశారు.
గోరంట్ల మాధవ్ మాజీ సీఐ. కానీ బరితెగింపులో నెంబర్ వన్. ఆయన న్యూడ్ వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అయింది. అది తనది కాదని వాదించారు కానీ.. నిరూపించడానికి మాత్రం దర్యాప్తు చేయమని అడగలేదు. అయితే ఆయన చంద్రబాబును కూడా చంపుతానని పలుమార్లు హెచ్చరించారు. అధికారంలో ఉన్నప్పుడు జేసీ బ్రదర్స్ తో పాటు చంద్రబాబుపైనా రెచ్చిపోయే వారు. ఇప్పుడు ఆయన సమయం దగ్గరకు వచ్చిందని టీడీపీ వర్గాలంటున్నాయి.
మాజీ పోలీసు అధికారి అయిన గోరంట్లకు పోలీసు పవర్ చూపించడం ఖాయమని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఐదో తేదీన ఆయన విజయవాడ సైబర్ క్రైమ్ ఎదుట హాజరైన తర్వాత చెప్పే విషయాలను బట్టి.. ఇతర కేసులను కూడా పరిగణనలోకి తీసుకుని పోలీసులు ఓ నిర్ణయం తీసుకుంటారు.