ఓ సినిమాలో చార్మినార్, రవీంద్రభారతి, హైటెక్ సిటీ లాంటి వాటిని … మాణిక్యం అమ్మేస్తే కామెడీ అనుకున్నారు. కానీ ఇప్పుడు నిజం అవుతోంది. రైల్వే స్టేషన్లను కూడా అమ్మేస్తున్నారు. మొన్నటిదాకా రైళ్లు అమ్మారు. ఇప్పుడు రైల్వే స్టేషన్లు అమ్ముతున్నారు. ఈ జాబితాలో ఏపీ నుంచి విజయవాడ చోటు దక్కించుకుంది. బెజవాడ రైల్వే స్టేషన్‌ను అమ్మడానికి రంగం సిద్ధమయింది. దక్షిణాది రాష్ట్రాల్లో విజయవాడ రైల్వే స్టేషన్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎప్పుడూ రద్దీగా ఉండే స్టేషన్ అత్యాధునిక సౌకర్యాలతో ఉంటుంది. ఇప్పుడీ స్టేషన్‌ను ప్రైవేటుకు అప్పగించడానికి రంగం సిద్ధమయింది.
నేరుగా ప్రభుత్వ ఆస్తులను అమ్మేయడం కంటే 99 ఏళ్ల లీజుకివ్వడం ఇప్పుడు కొత్త పద్దతి. ఆ పద్దతిలోనే ప్రైవేటుకు కట్ట బెడుతున్నారు. కేంద్ర రైల్వే శాఖ ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. నిజానికి గతంలోనే 30 ఏళ్ల లీజు పద్దతిన టెండర్లు పిలిచారు. కానీ ఎవరూ ముందుకు రాలేదు. అందుకే ఇప్పుడు 99 ఏళ్లకు ఇవ్వాలని నిర్మయించారు విజయవాడ డివిజన్ నుంచి రైల్వేకు గణనీయమైన ఆదాయం వస్తుంది. నిర్వహణ చార్జీల కన్నా.. స్టేషన్ పై నుంచి వచ్చే ఆదాయమే ఎక్కవగా ఉంటుంది. అయినప్పటికీ కేంద్రం ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ప్రభుత్వం చేతిలో ఏమీ ఉండకూడదు.. అన్ని ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలన్నట్లుగా విధానపరంగా వ్యవహరిస్తోంది. అందుకే..అమ్మడానికి రంగం సిద్ధం చేసుకుంది.
దేశంలో ఇప్పుడు రెండు కార్పొరేట్ సంస్థల హవా నడుస్తోంది. పెట్టుబడులు పెట్టాలన్నా… రైల్వే స్టేషన్లు, పోర్టులు కొనాలన్నా ఆ రెండు సంస్థలకే సాధ్యమవుతుంది. మిగతా ఏ భారీ కార్పొరేట్ సంస్థ కూడా వాటి కోసం పోటీ పడే ప్రయత్నాలు కూడా చేయడం లేదు. ఇప్పటికే వేల కోట్లు పెట్టిపోర్టులు కొనేస్తున్న కంపెనీలు.. తాజాగా రైల్వే స్టేషన్లను కూడా కొనేయడం కామన్‌గా కనిపిస్తోంది. ఏపీలోని ఆస్తులను ప్రధానంగా దక్కించుకునేందుకు కొంత మంది గుజరాతీ వ్యాపారులు పోటీ పడుతున్నారు. రైల్వే స్టేషన్లు.. విమానాశ్రయాలు కూడా… ఆ జాబితాలో చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటున్నారు.