విశాల్ కథానాయకుడిగా ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో రాబోతున్నా యాక్షన్ ఎంటర్ టైనర్ ‘లాఠీ’. విశాల్ సరసన సునయన హీరోయిన్గా నటిస్తోంది. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం టీజర్ ని రచయిత విజయేంద్రప్రసాద్ లాంచ్ చేశారు. ఈ ఈవెంట్ లో ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు విజయేంద్రప్రసాద్.
”విశాల్ గురించి అందరూ గొప్పగా చెప్పారు. నేను ఒక చెడ్డ మాట చెబుతాను. విశాల్ గారికి ఒక జబ్బు అంటుకుంది. సినిమా కథ ఎంత బడ్జెట్ అయినా ఎన్ని రోజులైనా షూటింగ్ చేయాలనే జబ్బు. ఈ జబ్బు మా అబ్బాయి రాజమౌళి దగ్గర నుండి అంటుకుంది(నవ్వుతూ) మా అబ్బాయి ఎలా అయితే సక్సెస్ అందుకున్నాడో విశాల్ కూడా విజయాన్ని అందుకుంటారని కోరుకుంటున్నాను. కార్తికేయ 2 ఈవెంట్ కి వెళ్లాను. అక్కడ పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. పెద్ద హిట్ అవుతుందని కోరుకున్నాను. దేవుని దయవల్ల పెద్ద విజయం సాధించింది. ‘లాఠీ’ కూడా అద్భుతమైన అందుకుంటుంది’ అని టీంకి బెస్ట్ విశేష్ చెప్పారు.