బాహుబలి, భజరంగీ భాయ్జాన్లాంటి సూపర్ హిట్లకు, భారీ చిత్రాలకు కథ అందించిన విజయేంద్రప్రసాద్ ఇప్పుడు మరో ప్రాజెక్ట్ రూపకల్పనలో బిజీగా ఉన్నారు. అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటించనున్నారు. ఆర్.ఎస్.ఎస్ నేపథ్యంలో సాగే కథ ఇది. దీనికి ఆర్.ఎస్.ఎస్ చీఫ్ భగవత్ నిర్మించనున్నారు. బడ్జెట్ దాదాపుగా రూ.180 కోట్లని తెలుస్తోంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చరిత్ర, సిద్దాంతాలు, సాధించిన విజయాలను ఇతివృత్తంగా తీసుకుని ఈ కథ మలుస్తున్నార్ట. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయినట్టు తెలుస్తోంది. అక్షయ్ కుమార్ తప్ప.. ప్రధాన తారాగణం ఎవరన్నది ఇంకెవ్వరూ తెలీదు. త్వరలోనే వాటి వివరాలు బయటకు రానున్నాయి. ఈ కథని, ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ని ఏ దర్శకుడి చేతిలో పెడతారన్నదీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆర్.ఎస్.ఎస్ సినిమా అంటే బీజేపీ సపోర్ట్ పూర్తి స్థాయిలో ఉంటుంది. ప్రభుత్వ పెద్దలూ ఈ సినిమా కోసం తెర వెనుక పని చేసే అవకాశం ఉంది.