పురాణ పాత్రలు, ఇతిహాసాలు.. కథలుగా మారుతున్న రోజులు ఇవి. వాటితోనే రికార్డు వసూళ్లు కొల్లగొడుతున్నారు. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం… ‘హనుమాన్’. అందులో హనుమంతుడినే హీరోగా చూపించారు. ఇప్పుడు ‘సీత’ కథ వస్తోంది. స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందించబోతున్నారు. కథ సిద్ధమైంది. దర్శకుడు కూడా ఫైనల్ అయ్యాడు. కానీ ‘సీత’ మాత్రం దొరకడం లేదు. సీత పాత్ర కోసం నటిని ఎంపిక చేయడం ఎప్పటికీ సవాలే. క్లీన్ ఇమేజ్ ఉన్న కథానాయిక కావాలి. అందుకోసం ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ అన్వేషణకు దిగారు. చాలామంది స్టార్ హీరోయిన్లని సీత పాత్ర కోసం పరిశీలించారు. ఇప్పుడు ఓ కొత్త హీరోయిన్ని తీసుకోవాలని ఫిక్సయ్యారు. అందుకోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి.
మరోవైపు రాజమౌళి – మహేష్ సినిమా కథపై విజయేంద్ర ప్రసాద్ కసరత్తులు పూర్తయ్యాయి. స్క్రిప్టు పూర్తి స్థాయిలో రెడీ అయ్యింది. దాన్ని రాజమౌళి చేతిలో పెట్టేశారు. ‘భజరంగీ భాయ్ జాన్’ సీక్వెల్ కోసం ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ కథ కూడా విజయేంద్ర ప్రసాద్ సిద్ధం చేశారు. సల్మాన్ ఖాన్‌కి వినిపించారు. అయితే దీనిపై సల్లూ భాయ్ ఓ నిర్ణయం తీసుకోవాల్సివుంది.