నాగార్జున – విజయేంద్ర ప్రసాద్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం రాజన్న. ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర ఆశించినంత విజయాన్ని అందుకోలేదు. కాకపోతే నైజాంలో రజాకారులపై ఉద్యమ నేపథ్యంలో తీసిన కొన్ని సన్నివేశాలు బాగా నచ్చాయి. దానికి తోడు ఎస్.ఎస్.రాజమౌళి ఈ సినిమాలో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్‌ని తెరకెక్కించాడు. దాంతో రాజన్న ప్రత్యేకత సంతరించుకొంది. ఇప్పుడీ చిత్రాన్ని బాలీవుడ్లో తీసుకెళ్తున్నారు. సన్నీడియోల్ ప్రధాన పాత్ర పోషించనున్నాడు. విజయేంద్ర ప్రసాద్ దర్శకుడు.
భజరంగీ భాయ్ జాన్ చిత్రానికి కథ అందించి, బాలీవుడ్‌లోనూ పాపులర్ అయ్యాడు విజయేంద్ర ప్రసాద్. ఆ సినిమానే.. బాలీవుడ్లో మెగా ఫోన్ పట్టేంత ఉత్సాహం ఇచ్చింది. రాజన్న సినిమాలో కొన్ని మార్పులు చేసి బాలీవుడ్లో తీస్తారట. ఈ సినిమాకి భారత్ మాతాకీ జై అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. మరో విశేషం ఏంటంటే ఈ చిత్రానికి రాజమౌళి క్రియేటీవ్ హెడ్‌గా పనిచేస్తాడట. బాహుబలితో రాజమౌళి ఖ్యాతి బాలీవుడ్‌కీ తాకింది. జక్కన్న క్రియేటీవ్ హెడ్ అంటే,.. ఈ సినిమాకి క్రేజ్ అమాంతం పెరిగిపోవడం ఖాయం. మరి ఇక్కడ ఫ్లాప్ అయిన సినిమా బాలీవుడ్లో మాత్రం హిట్టవుతుందన్న గ్యారెంటీ ఏమిటో అర్థం కాదు. దర్శకుడిగా విజయేంద్రుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ కాలేదు. మరి ఈసారి బాలీవుడ్లో అయినా.. తన సత్తా చూపిస్తాడంటారా?