ఓ వైపు గ్రామ సచివాలయాల ఉద్యోగాల పరీక్షల పేపర్ లీకేజీ అయిందన్న ప్రచారం జరుగుతున్న సమయంలో… ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ కార్యకర్తలకే గ్రామసచివాలయాల ఉద్యోగాలు అత్యధికం వచ్చాయని ప్రకటించారు. ఇప్పటికే వాలంటీర్ల విషయంలో 90 శాతం మందిని వైసీపీ కార్యకర్తలనే తీసుకున్నామని.. ప్రకటించారు. తన దగ్గర లెక్కలు ఉన్నాయని స్పష్టం చేశారు. వైసీపీ కోసం పని చేసే వారికి భవిష్యత్ లో ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
గ్రామ సచివాలాయ ఉద్యోగాలు.. పోటీ పరీక్షల్లా నిర్వహించినవి. అయితే.. కేవలం.. కొంత మందికి మాత్రమే.. ప్రత్యేకంగా అత్యధిక మార్కులు ఎలా వచ్చాయో ఎవరికీ అర్థం కావడం లేదు. ఒక సామాజికవర్గం వారు జనరల్ కేటగిరీ ఉద్యోగాల్లో యభై శాతానిపైగా ఉద్ోయగాలు సాధించారని ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వంలోని కొంత మంది ప్రత్యేకంగా పేపర్‌ను లీక్ చేసి.. కావాల్సిన వారికి ముందుగానే పంపారని..టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వేలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకుని..కష్టపడిన వారిని ప్రభుత్వం మోసం చేసిందని.. ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో విజయసాయిరెడ్డి.. తమ పార్టీ కార్యకర్తలకే అత్యధికంగా ఉద్యోగాలొచ్చాయని చెప్పడం… కలకలం రేపుతోంది.
వాలంటీర్ల ఉద్యోగాల విషయంలోనూ… పార్టీలు, కులాలు, మతాలు చూడలేదని… ప్రభుత్వం ప్రకటిస్తూ వస్తోంది. కానీ.. విజయసాయిరెడ్డి మాత్రం.. ఏకంగా 90 శాతం మందిని వైసీపీ కార్యకర్తలనే తీసుకున్నామని ప్రకటిస్తున్నారు. ఎన్నికల్లో పని చేసినందున… వారికి తగిన ప్రతిఫలం ఇస్తామని ఎన్నికలకు ముందు చెప్పామని.. హామీని నెరవేరుస్తున్నామని సమర్థించుకుంటున్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో బాగా పని చేసే వారికి ప్రభుత్వ ఉద్యోగాలనే.. విజయసాయిరెడ్డి ఆఫర్ గా ప్రకటించడం చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే…గ్రామ సచివాలయ ఉద్యోగాల పరీక్షల తీరుపై ఉద్యోగార్థుల్లో అసహనం కనిపిస్తోంది. అయినా విజయసాయిరెడ్డి లెక్క చేయకుండా.. తమ పార్టీ కార్యకర్తలకే వచ్చాయని ప్రకటిస్తున్నారు.