వైసీపీ నేతలు దిగజారిపోతున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఓ బిడ్డ జగన్ రెడ్డి ఆదేశించాడని మరో బిడ్డ షర్మిలపై తప్పుడు ఆరోపణలు చేస్తూ అడ్డగోలు రాజకీయ విమర్శలు చేస్తూ తమకు భవిష్యత్ , డబ్బులు ఇచ్చిన నేత కుమార్తెను దారుణంగా కించ పరుస్తున్నారు. జగన్ రెడ్డితో ఆస్తి గొడవలు ఉంటే దాన్ని ఆయన రాజకీయం చేసి పార్టీ నేతలందరితో షర్మిలను తిట్టిస్తున్నారు. ఇప్పుడు విజయసాయిరెడ్డిని కూడా రంగంలోకి దింపారు. ఆయన కూడా అదే చెబుతున్నారు.
రాజశేఖర్ రెడ్డి మరణానికి కారకుడైన చంద్రబాబుతో కలవడం సిగ్గుచేటని హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు మెప్పు కోసం పసుపు చీర కట్టుకుని వెళ్తావా షర్మిలా ఆమె డ్రెస్సింగ్ పైనా వి.సా.రెడ్డి అనుచితమ వ్యాఖ్యలు చేశారు. విజయమ్మ కన్నీళ్లు తుడిచేందుకు కాదు.. చంద్రబాబు కళ్లల్లో ఆనందం చూసేందుకే షర్మిల ఈ రాద్ధాంతమన్నారు. జగన్ మళ్లీ సీఎం అవ్వకూడదన్న చంద్రబాబు ఎజెండాతోనే షర్మిల పని చేస్తున్నారని .. అన్నను తిట్టేందుకే షర్మిల ప్రెస్మీట్లు పెట్టారు ..ఇది ఆస్తి తగాదా కాదు.. అధికారం కోసం తగాదా ్ని విశ్లేషించారు. చంద్రబాబుతో లాలూచి పడ్డారని ఆరోపించారు.
జగన్ రెడ్డికి తన వికృతమైన పనుల వల్ల ప్రతి కష్టానికి చంద్రబాబునే కారణంగా చూపిస్తూ ఉంటారు. ఇంత కన్నా దగజారురులే అనుకున్న ప్రతీ సారి మరింతగా దిగజారిపోతున్నారు. ఆయన ఇంట్లో .. జగన్ రెడ్డి చేసిన తప్పుల వల్ల వచ్చిన కష్టాలు, వివాదాలు, విబేధాలకు కూడా చంద్రబాబునే కారణంగా చూపిస్తున్నారు. దీని వల్ల కుటుంబంలో వివాదాలు ఎప్పుడూ సమసిపోకుండా చేసుకుంటున్నారు ఆయన పిచ్చి తనానికి ఎవరూ సలహాలిచ్చే ప్రయత్నం కూడా చేయలేకపోతున్నారని వైసీపీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు.