చాలా రోజుల పాటు వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉండి మళ్లీ ఇటీవలె తెరపైకి వచ్చిన విజయసాయిరెడ్డికి.. పల్నాడు, బాపట్ల, ఒంగోలు జిల్లాల బాధ్యతలిచ్చారు సీఎం జగన్. అక్కడ పరిస్థితుల్ని చకబెట్టేందుకు ఆయన పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో చిలుకలూరిపేట నియోజకవర్గం విషయంలో విడదల రజనీ తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గంలో వర్గ విబేధాల్ని పెంచుతున్నారని.. ఇతరుల్ని పార్టీకి దూరం చేస్తున్నారని ఇది మంచి పద్దతి కాదని క్లాస్ పీకినట్లుగా తెలుస్తోంది.
అయితే ఈ పరిణామంపై వైసీపీలో ఆశ్చర్యకర చర్చలు జరుగుతున్నాయి. చిలుకలూరిపేట నియోజకవర్గంలో ఎంపీ కృష్ణదేవరాయులు పర్యటిస్తే రాళ్లేసి కొట్టి పంపించారు. ఆయన స్థానిక ఎంపీ అయినా నియోజకవర్గంలో తమ అనుమతితోలనే తిరగాలని రూల్ పెట్టారు. కనీసం ఎంపీకి ప్రోటోకాల్ లభించదు. పార్టీ పెద్దలకు ఎంతగా మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. అది విడదల రజనీ పవర్ అని అలాంటిది ఇప్పుడు విజయసాయిరెడ్డి వచ్చి వార్నింగ్ ఇస్తారా అని.. ఆమె వర్గీయులు రగిలిపోతున్నారు. పార్టీ కోసం విడదల రజనీ ఎంతో కష్టపడుతున్నారని… పార్టీకి నష్టం చేసే వారిని .. రజనీకి వ్యతిరేకంగా రాజకీయాలు చేసే వారిని కంట్రోల్ చేస్తే తప్పేమిటన్న వాదనను ఎక్కువ మంది వినిపిస్తున్నారు.
అయితే విజయసాయిరెడ్డి ఇంటెన్షనల్ గానే విడదల రజనీ విషయంలో ఆగ్రహంగా ఉన్నారని కూడా వైసీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. విజయసాయిరెడ్డికి ఓ ప్రత్యేకమైన ప్లాన్ ఉందని.. దాని వెనుక వైసీపీ అంతర్గత రాజకీయాల ఎఫెక్ట్ ఉందని చెబుతున్నారు. మొత్తంగా ఈ వ్యవహారంలో తదుపరి పరిణామాలు కూడా ఊహించనట్లుగా ఉంటాయన్నట్లుగా పరిస్థితులు మారుతున్నాయంటున్నారు.