వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత విజయసాయిరెడ్డి… ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి అవుతారని జరిగిన , జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. విజయసాయిరెడ్డిని.. పార్లమెంటరీ పార్టీ నేతగా నియమిస్తూ.. పార్టీ అధ్యక్షుడు జగన్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయన ఢిల్లీ వ్యవహారాలపై పరిమితం కానున్నారు. ఏపీ ఆర్థిక మంత్రిగా.. సీనియర్ను నియమించే అవకాశం ఉంది. విజయసాయిరెడ్డి.. ఆడిటర్ గా పేరు ప్రఖ్యాతులు పొందారు. ఎలాంటి పేరు అయినప్పటికీ.. ఆయన ఆర్థిక వ్యవహారాల్లో రాటుదేలిపోయారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో.. ఆయనే పరిస్థితులు చక్కదిద్దగలరని.. ఆయనను ఆర్థికమంత్రిగా పెడతరాని.. వైసీపీలోనే ప్రచారం జరిగింది. జగన్తో ఉన్న అనుబంధం దృష్ట్యా విజయసాయిరెడ్డి కూడా దానికి సిద్ధంగా ఉంటారని అనుకున్నారు. కానీ జగన్ మాత్రం వేరే విధంగా ఆలోచించారు.
విజయసాయిరెడ్డి ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. గత ఐదేళ్ల కాలంలో ఢిల్లీలో ఆయన వైసీపీ తరపున అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించారు. ప్రధానమంత్రి కార్యాలయంలో.. పలుకుబడి సాధించారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. చంద్రబాబుకు పెద్దగా అపాయింట్మెంట్లు ఇవ్వని పీఎంవో.. విజయసాయిరెడ్డికి మాత్రం ఫ్రీ యాక్సెస్ ఇచ్చేవారు. ఈ కోణంలోనే… వైసీపీ, బీజేపీ మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయనే ప్రచారం ఉంది. ఇప్పుడు.. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. కేంద్రంలోనూ బీజేపీ ఉంది. ఇప్పుడు.. ఢిల్లీలో మరింత సమన్వయం అవసరమని.. జగన్మోహన్ రెడ్డి భావించినట్లు తెలుస్తోంది. అందుకే.. పార్లమెంట్ పార్టీ నేతగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
వాస్తవానికి విజయసాయిరెడ్డికి.. మంత్రి పదవి చేపట్టాలనే ఆసక్తి ఉంది. 2014 ఎన్నికలకు ముందు జైలు నుంచి విడుదలైన తర్వాత పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకం అయినప్పుడే.. ఆయన ఓ సందర్భంలో తన ఆసక్తిని వెల్లడించారు. బహుశా.. అప్పట్లో వైసీపీ విజయం సాధించి ఉన్నట్లయితే.. ఆయన మంత్రి అయి ఉండేవారేమో..?. కానీ అప్పట్లో పరాజయం పాలు కావడంతో.. తర్వాత రాజ్యసభ పదవి దక్కింది. ఆ పదవితో.. ఢిల్లీలో చక్రం తిప్పారు. అదే ఇప్పుడు.. ఆయనకు మంత్రి పదవిని దూరం చేసింది.