విజయసాయిరెడ్డి ఇచ్చే కమిషన్ల కక్కుర్తికి ఆశపడిన ఆడిటింగ్ కంపెనీలు చేస్తున్న, చేసిన తప్పుల కారణంగా అసలు ఆ కంపెనీల విశ్వసనీయతపైనే దెబ్బ పడుతోంది. ఆడిటర్లు అంటే అంతా పరిశీలన చేసి తప్పులు కనిపెడతారని అనుకుంటారు. కానీ తప్పుడు పనులు చేసి బెదిరిస్తారని ఎవరూ అనుకోరు. కానీ విజయసాయిరెడ్డి అనే వ్యక్తి ఆడిటర్ అవడంతో ఇప్పుడు ఆ వ్యవస్థపైనే అనుమానాలు పెంచేలా అక్రమాలు చేశారు.
కాకినాడ పోర్టును కొట్టేసేందుకు పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పీ అనే ఎడిటింగ్ సంస్థను రంగంలోకి దింపారు. వాళ్లు వచ్చి వెయ్యి కోట్ల అక్రమాలు అని తేల్చి హంగామా చేశారు. చివరికి పోర్టు అరబిందోకి రాసిచ్చేలా చేసుకుని తూచ్.. అంత లేదు.. తొమ్మిది కోట్లే అని చెప్పి మరో లేఖ ఇచ్చి .. విజయసాయిరెడ్డి ఇచ్చిన కమిషన్ తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు వాళ్లు సీఐడీ రాడార్ లో ఉన్నారు. జైలుకు దగ్గరగా ఉన్నారు. అంతకు ముందు చంద్రబాబు స్కిల్ కేసులోనూ ఓ ఆడిటింగ్ కంపెనీది కీలక పాత్ర. ఆ ఆడిటింగ్ కంపెనీ అన్నీ పరిశీలన చేయుకండా చేశారు. ఆ కంపెనీ కూడా రిస్క్ లో ఉంది.
విజయసాయిరెడ్డి ఆడిటింగ్ వ్యవస్థను ఎంత ఘోరంగా వాడారంటే.. చివరికి డెలాయిట్ తోనూ తప్పుడు నివేదికలు ఇప్పించి జగన్ సంస్థల వాల్యూను ఎక్కువగా నిర్దారించి ఎక్కువ మొత్తానికి వాటాలు అమ్మేశారు. ఈ కేసులన్నీ ఉండటంతో.. చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఆయనను వ్యవస్థకు చీడపురుగుగా భావించి తొలగించాలని నిర్ణయించుకుంది. అయితే ఆయన సంబంధం లేదని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసి అనుకూల ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆ తీర్పుపై డివిజన్ బెంచ్ కు వెళ్లారు. మొత్తంగా విజయసాయిరెడ్డి తనను పెంచిన వ్యవస్థను కూడా చెరబట్టేశారు.