ఢిల్లీలో విజయసాయిరెడ్డి కాకా పట్టు పనులు ప్రారంభించారు. 2014-19 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తమను ఎవరు కాపాడుతారు అనుకుంటారో అలాంటి వారందరి కాళ్లు పట్టుకునేందుకు రెడీగా ఉండేవారు. న్యాయమూర్తుల్ని కూడా వదలకుండా… ఎక్కడ కనిపిస్తారో తెలుసుకుని మరీ అక్కడ ప్రత్యక్షమయ్యేవారు. బయటకు తెలియాలి అని అనుకున్నవారి కాళ్లు పట్టుకున్న ఫోటోలను విడుదల చేసుకునేవారు. అందుకు ఆయన వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత హోదా పనికి వచ్చేది.
ఇప్పుడు ఆయనకు పార్లమెంటరీ పార్టీ నేత హోదా లేదు. కేవలం రాజ్యసభ పక్ష నేత. అయినప్పటికీ జగన్ రెడ్డిని కాపాడుకోవాలంటే.. ముందు తమను తాము కాపాడుకోవాలని విజయసాయిరెడ్డికి బాగా తెలుసు. అందుకే దొరికిన కేంద్ర మంత్రి ఇంటికి వెళ్లి పరిచయాలు పెంచుకుంటున్నారు. ఐదేళ్ల పాటు అధికారంల ఉండి విశాఖలో మెట్రో ప్రాజెక్టులో ఒక్క అడుగు ముందుకు వేయకపోగా.. కుమార్తె కంపెనీ పేరుతో వందల ఎకరాలు కొట్టేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పుడు రైల్వే మంత్రిని కలిసి విశాఖ మెట్రో గురించి అడిగినట్లుగా ట్విట్టర్ లో పోస్టు చేసుకున్నారు.
అధికారంలో ఉన్నంతకాలం ఆయన ట్విట్టర్ అంతా భయంకరమైన కంపు కొట్టేది. ఇప్పుడు అధికారం పోయే సరికి.. సుద్దపూసలా మారిపోయారు. ఆయన చేసిన విశాఖ నిర్వాకాల సంగతి వెలుగులోకి వస్తాయనో.. లేకపోతే విశాఖ గురించి మర్చిపోలేకనో ఆయన రాజకీయంగా ఇంకా విశాఖ వాసనలే ఉంటున్నాయి. ఆయన ఎవరు దొరికితే వాళ్ల దగ్గరకు వెళ్లి కాళ్లు పట్టేసుకునే ఫోటోలు వరుసగా పోస్టు చేసే అవకాశాలు ఉన్నాయి.