అసలైన ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఏమిటో విశాఖలో వైసీపీలో నెంబర్ టు విజయసాయిరెడ్డి చేసి చూపించారు. రాజధాని .. రాజధాని అని ఎందుకు కలవరిస్తున్నారో ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఆయన కుమార్తె, అల్లుడు పేరు మీద రెండేళ్ల కింద పెట్టిన కంపెనీ పేరుతో ఎకరాలకు ఎకరాలు.. గజాల లెక్కన కొనుగోలు చేసి.. పెట్టుకుంటున్నారు. దాదాపుగా ప్రతీ వారం ఓ రిజిస్ట్రేషన్ జరుగుతోంది. పేపర్లపై ఇప్పటి వరకూ యాభై కోట్లకుపైగా నగదు పెట్టి కొనుగోలు చేశారు. కానీ బహిరంగ మార్కెట్ ధర మాత్రం నాలుగు వందల కోట్ల వరకూ ఉంటుందని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి
వారానికో రిజిస్ట్రేషన్ – ఎకరాలకు ఎకరాలు కొనుగోలు !
రెండేళ్ల కిందట విజయసాయిరెడ్డి అల్లుడు, కుమార్తె కలిసి అవ్యాన్ రియల్టర్స్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. అలా ఏర్పాటు చేయడం ఆలస్యం.. భూములపై కన్నేసింది. వరుసగా ఒప్పందాలు చేసుకుంది. రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది. అ పరంపరం అలా కొనసాగుతోంది. “ప్రపోజ్డ్ క్యాపిటల్” అంటూ వైసీపీ నేతలు హడావుడి చేస్తున్న ఏరియాకు దగ్గరలో… అలైన్ మెంట్ మార్చేసిన బోగాపురం ఎయిర్ పోర్టు సిక్స్ లైన్స్ రహదారి పక్కన ఈ భూములు ఉన్నాయి. విషయం ఏమిటంటే.. సముద్రం పక్క నుంచి వెళ్లాల్సిన రహదారి విజయసాయిరెడ్డి కుమార్తె, అల్లుడు కొన్న భూముల దగ్గరకు వచ్చే సరి…దారి తప్పి.. వారి భూముల పక్క నుంచి వెళ్తోంది. ఇదో పెద్ద స్కాం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
అమరావతిపై బురదచల్లి…విశాఖలో చేసి చూపించిన సాయిరెడ్డి !
అధికారికంగా తెలిసిన రికార్డుల ప్రకారం.. ఎనభై వేలకుపైగా గజాలను విజయసాయిరెడ్డి తన కుమార్తె, అల్లుడి పేర్లపై కొనుగోలు చేశారు. ఇంకా రిజిస్ట్రేషన్ కానీ.. ఒప్పందాలదశలోనే ఉన్న వి అంతకు రెండింతలు ఉంటాయని చెబుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఉత్తరాంధ్రకు తానే సీఎం అన్నట్లుగా చెలరేగిపోయారు. ఆయనపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. కానీ తనకు తన కుటుంబానికి ఆస్తులు లేవని ఆయనచెబుతూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆయన విశాఖలో ఎకరాలకు ఎకరాలు కొనుగోలు చేసినట్లుగా తేలిపోయింది. అసలు ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటే ఇదీ… అమరావతిలో జరిగిందని ఆరోపించారు కానీ.. ఇక్కడచేసి చూపించారు.
దసపల్లా భూములూ విజయసాయిరెడ్డి బినామీ ఖాతాలోనే !?
దసపల్లా భూములూ బినామీలుగా విజయసాయిరెడ్డివేనని ఆరోపణలు ఉన్నాయి. భూముల యజమానులతో డెలవప్మెంట్ ఒప్పందం చేసుకున్న అష్యూర్ కంపెనీలో డైరక్టర్లు విజయసాయిరెడ్డి ట్రస్టులో పని చేసేవాళ్లు. ఈ కంపెనీకి నిధులు కూడా విజయసాయిరెడ్డి కుమార్తె, అల్లుడికి చెందిన అవ్యాస్ కంపెనీ నుంచే వచ్చాయి. మ౧త్తంగా విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పేరుతో మొత్తం గుప్పిట్లో పెట్టుకుని భూదందాలకు పాల్పడుతూ.. ఇన్ సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడుతున్నట్లుగా బయటపడింది. ఇదంతా సీఎం జగన్‌కు తెలియకుండా జరుగుతుందని ఎవరూ అనుకోవడం లేదు.