పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఏపీకి ఎవరిచ్చారు..?
పోలవరం నిర్మాణంలో అక్రమాలున్నాయా..?
పోలవరంలో క్వాలిటీ చెక్ సాగుతోందా..?
పోలవరంలో బయటపడిన లోపాల వివరాలేమిటి..?
పోలవరంపై పొరుగు రాష్ట్రాల సమ్మతి తీసుకున్నారా..?
పోలవరం ముంపు సమస్యను పరిష్కరించారా…?
………… పోలవరం.. పోలవరం.. పోలవరం.. అంటూ.. పార్లమెంట్లో ప్రశ్నలతో దాడి చేస్తున్నారు… వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, కాంగ్రెస ఎంపీ విజయసాయిరెడ్డి. వీరిద్దరికి ప్రధాన ఎజెండా పోలవరం ప్రాజెక్ట్‌లానే ఉంది. పోలవరంపై.. ఏదో ఒక నెగెటివ్ ఆన్సర్ కేంద్రం దగ్గర నుంచి రాక పోతుందా.. అనే విశ్వ ప్రయత్నాలు వీరు ప్రశ్నల ద్వారా చేస్తున్నారు. వీరి తీరు చూసి…ఇతర పార్టీల నేతలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఏపీలో పోలవరం తప్ప.. ఇంకే సమస్య లేనట్లు.. వీళ్లిద్దరూ పోలవరం ప్రాజెక్ట్‌పై ఎందుకు గురి పెట్టారో వారికి అర్థం కావడం లేదు.
నిన్నటికి నిన్న కేవీపీ రామచంద్రరావు .. రాజ్యసభలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఏపీకి ఎందుకిచ్చారంటూ.. ఓ ప్రశ్నవేశారు. బహుశా.. ఏపీ అడిగింది.. ఇచ్చామని చెబుతారేమో.. ఆ తర్వాత సంగతి సాక్షి పత్రిక చూసుకుంటుందని అనుకుని ఉంటారు. కానీ… అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లే ఇచ్చాం.. అందులో తప్పేమీ లేదని మంత్రి నుంచి సమాధానం వచ్చింది. అంతకు ముందు లోక్‌సభలో… పోలవరం ముంపు నిర్వాసితులకు ఎంత మందికి పరిహారం ఇచ్చారనే ప్రశ్న వేశారు. అది కూడా పూర్తిగా వేయలేదు… కేవలం ఎస్టీ వర్గ నిర్వాసితులకు ఎంత మందికి పునవరాసం కల్పించారనే ప్రశ్న వేశారు. వీరిద్దరూ ఇలా ప్రశ్నలు వేయడం ఇదే మొదటి సారి కాదు. వారానికో సారి.. ఏదో ఓ ప్రశ్న పోలవరం మీద వేస్తూనే ఉంటారు. ఏదో ఒక నెగెటివ్ టాపిక్ దొరికితే .. సాక్షిలో పేజీలకు పేజీలు రాస్తూ ఉంటారు.
పోలవరంపై వీరెందుకు ఇలా ప్రశ్నల పరంపర వేస్తున్నారంటే… ప్రభుత్వం చెప్పే స్పష్టమైన కారణం.. సమాచారం ఇతర రాష్ట్రాలకు చేరవేయడం. పార్లమెంట్లో సభ్యులు అడిగే ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానాలు.. అందరికీ చేరతాయి. అందులో అంతా సమాచారం ఉంటుంది. పోలవరం ప్రాజెక్ట్ పై… అటు ఒడిషా, ఇటు చత్తీస్ ఘడ్ అభ్యంతరాలు తెలుపుతున్నాయి. ఆయా రాష్ట్రాలను రెచ్చగొట్టి.. ప్రాజెక్ట్ ను నిలిపివేసేందుకు.. వారు తమ ప్రశ్నల ద్వారా సమాచారాన్ని ఆయా రాష్ట్రాలకు పంపుతున్నరాని… మంత్రి దేవినేని ఉమ పదే పదే ఆరోపిస్తున్నారు. అదే నిజం చేస్తున్న కేవీపీ, విజయసాయిరెడ్డి. పోలవరపై… వీరి ఇంట్రెస్ట్ ఏమిటో.. సాధారణ ప్రజలకు అర్థం కావడం లేదు. పోలవరం ప్రాజెక్ట్ ను ఆపాలనేది వీరి తాపత్రయంగా కనిపిస్తోందన్నదే… చాలా మంది అభిప్రాయం. లేకపోతే.. వేగంగా సాగుతున్న పనులను అడ్డుకునేలా.. వీరి ప్రశ్నలు ఉండటమేమిటన్నది అసలు సందేహం…!