మాన్సాస్ ట్రస్ట్ మళ్లీ తమ చేతుల్లో నుంచి జారిపోయిందని అసహనమో… చేయాలనుకున్న భూ మాయ అంతా చేయలేకపోతున్నామన్న ఆగ్రహమో కానీ.. ఉత్తరాంధ్ర సీఎంగా చెలామణి అవుతున్న విజయసాయిరెడ్డి కంట్రోల్ తప్పి పోతున్నారు. మాన్సాస్ ట్రస్ట్ విషయంలో హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటి నుండి ఆయన అశోక్ గజపతిరాజును బెదిరించేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా.. అశోక్‌ను జైలుకు పంపుతామని ప్రకటించారు. అశోక్‌పై ఫోర్జరీ కేసు కూడా ఉందని.. మాన్సాస్ అక్రమాలన్నింటిపై విచారణ జరుగుతోందని.. ఏదో రోజు జైల్లో అశోక్ గజపతిరాజును చూడొచ్చన్నారు. అశోక్.. మాన్సాస్ ట్రస్ట్‌కు మాత్రమే రాజని.. విజయనగరంకు కాదని ఆయన చెప్పుకొచ్చారు. అశోక్ గజపతిరాజును విజయసాయిరెడ్డి చాలా మాటలు అంటున్నారు.. దొంగ అంటున్నారు.. కబ్జా కోరు అంటున్నారు. .. ఇంకా వైసీపీ బ్రాండ్ విమర్శలు చాలా చేస్తున్నారు.
విజయసాయిరెడ్డి మాటలు ఉత్తరాంధ్రలో సంచలనం సృష్టిస్తున్నాయి. రాజకీయాల్లో అశోక్ గజపతిరాజుకు ఓ స్వచ్చమైన ఇమేజ్ ఉంది. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో విద్యారంగంలో మాన్సాస్ ట్రస్ట్ చేసిన సేవ .. ప్రభుత్వ రంగంలో కూడా చేయలేదు. గజపతిరాజులు.. కొన్ని లక్షల కోట్ల ఆస్తిని ట్రస్ట్‌కు దానం చేసి.. వాటి ద్వారా పేదలకు విద్య, వైద్యం వంటి సౌకర్యాలు అందేలా కృషి చేస్తున్నారు. దశాబ్దాలుగా గజపతిరాజులు రాజకీయాల్లో ఉన్నారు.. ఎన్నో పదవులు అనుభవించారు..కానీ వారిపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. అలాంటిది.. ఇప్పుడు విజయసాయిరెడ్డి లాంటి నేతలు… రాజకీయాల్లో అవినీతి కోసం సూట్ కేసు కంపెనీలు పెట్టి వేల కోట్లను హవాలా చేయడంలో మాస్టర్ మైండ్‌గా పేరు పొందిన వ్యక్తి.. అశోక్ గజపతిరాజును జైలుకు పంపుతామని ప్రకటించడం… చర్చనీయాంశమవుతోంది.
ఏపీలో ఉన్న పరిస్థితికి.. విజయసాయిరెడ్డి మాటలు కచ్చితమైన సాక్ష్యంగా ఉన్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై అశోక్ గజపతిరాజు కూల్‌గా స్పందించారు. ఆయన ఇంకా జ్ఞానం పెంచుకోవాల్సి ఉందన్నారు. అయితే.. ఏపీ సర్కార్‌కు చట్టం న్యాయం ఏమీ లేదు.. ఎవరినైనా అరెస్ట్ చేయాలనుకుంటే రాత్రికి రాత్రి చేస్తున్నారు. ఏదైనా కూల్చేయాలనుకుంటే.. రాత్రికి రాత్రి కూల్చేస్తున్నారు. ఈ క్రమంలో అశోక్‌పైనా ఏదో ఓ కేసు పెట్టి రేపో మాపో అరెస్ట్ చేసినా ఆశ్చర్యం లేదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.