ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ కి న్యాయం చేయలేక తన సీటు కూటమికి పోతుందని తెలిసినా రాజీనామా చేస్తున్నానని విజయసాయిరెడ్డి ప్రకటించారు. రాజ్యసభ చైర్మన్ కు రాజీనామా పత్రం ఇచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు . రాజీనామాలకు కారణం ఏమింటే.. వైసీపీకి న్యాయం చేయలేకపోతున్నందుకే రాజీనామా చేశారట. జగన్ కు చెప్పే రాజీనామా చేస్తున్నానని ఆయన వద్దన్నారని.. పార్టీ అండగా ఉంటుందని చెప్పారన్నారు. కానీ తాను మాత్రం జగన్ మాట వినదల్చుకోలేదన్నట్లుగా నిర్ణయం తీసుకున్నానని.. రాజీనామా నిర్ణయం మారదని చెప్పానన్నారు.
నీతిగా నిజాయితీగా బతకాలనుకుంటున్నానని.. చెడ్డపేరు తెచ్చుకోవడం ఇష్టం విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో అబద్దాలు చెప్పకపోతే రాజకీయాలు చేయడం కష్టమని.. అబద్దాలు చెప్పలేక రాజకీయాల నుంచి వైదొలుగుతున్నానన్నారు. ఇప్పటికి ఆయనకు ఏదో గొప్ప పేరు.. నీతి మంతుడనే పేరు ఉన్నట్లుగా ఆయనకు ఆయనకు ఆయన చెప్పుకున్నారు. బతకుంతా అబద్దమే అయినా అబద్దాలు చెప్పలేకపోతున్నట్లుగా బిల్డప్ ఇచ్చారు. బెంగళూరు, విజయవాడ, విశాఖల్లో ఒక్కో ఇల్లు ఉంది కానీ.. ఇంకేమీ లేదన్నారు. అంటే హైదరాబాద్ లో కూడా విజయసాయిరెడ్డికి ఇల్లు కూడా లేదని చెబుతున్నారు. తన కుమార్తె, అల్లుడికి వేల కోట్లు ఉన్నాయని వారి ఆస్తులు తనకు ఆపాదిస్తే ఏమీ చేయలేనని చెప్పుకొచ్చారు.
చంద్రబాబును రాజకీయంగా వ్యతిరేకించాను తప్ప.. వ్యక్తిగతంగా వైరం పెట్టుకోలేదని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. చెన్నైలో ఉన్నప్పటి నుంచి పవన్ కల్యాణ్ తో పరిచయం ఉందన్నారు కేసుల మాఫీ కోసం రాజీనామా చేశానని అంటున్నానని.. ఎన్ని ఇబ్బందులు పెట్టినా జగన్ కేసుల్లో అప్రూవల్ గా మారలేదన్నారు. కూటమి ప్రభుత్వం చాలా కేసులు పెట్టిందని.. అయినా ధైర్యంగా ఎదుర్కొంటానన్నారు. పోర్టు కేసుతో తనకు సంబంధం లేదన్నారు. వైసీపీలో తన ప్రాధాన్యాన్ని ఎవరూ తగ్గించలేరన్నారు.