అధికారం చేతిలోకి వస్తే.. ప్రశ్నించే వ్యవస్థలన్నింటినీ గుప్పిట్లోకి తెచ్చుకోవాలనుకునే రాజకీయం ఇప్పుడు.. అంతటా నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మొట్టమొదటగా.. అధికార పార్టీలకు… ప్రభుత్వాలకు టార్గెట్‌గా.. మీడియానే నిలుస్తోంది. మీడియా సంస్థల యాజమాన్యాలు.. రాజీ పడక తప్పని పరిస్థితులు కల్పిస్తున్నాయి. ఫలితంగా.. జర్నలిస్టుల .. ఉద్యోగ జీవితాలకు అర్థాంతరంగా… ముగింపు పడుతోంది. ఏపీలోనూ ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో.. తొలి సారిగా.. అదీ కూడా విజయవాడ కేంద్రంగా ప్రారంభమైన తొలి తెలుగు న్యూస్ చానల్ AP 24/7 .. అధికార పార్టీ ఆగ్రహానికి గురైనట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ చానల్ ఫేస్‌గా ఉన్న వెంకటకృష్ణ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి.. ఆయనను సాగనంపేవరకూ.. యాజమాన్యంపై.. విజయసాయిరెడ్డి ఒత్తిడి చేశారని.. తాను అనుకున్న సాధించారన్న ప్రచారం జరుగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ జర్నలిస్టుగా పేరు పొందిన వెంకటకృష్ణ… పలు చానళ్లలో చేశారు. తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన ఆయన ఏపీ చానల్ AP24/7 బాధ్యతలను తీసుకున్నారు. సక్సెస్ ఫుల్‌గా లాంచ్ చేశారు. ఏపీ ప్రజల్లోకి ప్రతిభావంతంగా తీసుకెళ్లగలిగారు. చర్చాకార్యక్రమాలు నిర్వహించడంలో తనదైన ప్రత్యేకత నిలబెట్టుకున్న వెంకటకృష్ణను.. ఇప్పుడు.. AP24/7 యాజమాన్యం.. బయటకు వెళ్లి పొమ్మని చెప్పేసిందని మీడియావర్గాలు చెబుతున్నాయి. ఆయన చర్చాకార్యక్రమాలు నిర్వహిస్తున్న వైనం.. విజయసాయిరెడ్డికి నచ్చలేదని.. ఆయన వైసీపీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్న భావనతో.. విజయసాయిరెడ్డి ఉన్నారంటున్నారు. ఆయన ఒత్తిడి మేరకు.. వెంకటకృష్ణను యాజమాన్యం సాగనంపక తప్పని పరిస్థితికి చేరుకుందంటున్నారు.
అయితే.. గతంలో వెంకటకృష్ణ.. హెచ్ఎంటీవీలో చేస్తున్నప్పుడు కూడా.. అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. అప్పుడు AP24/7 తో తెరమీదకు వచ్చారు. ఇప్పుడు.. కూడా.. ఇతర చానళ్లలో ఉద్యోగం వెదుక్కోవడం కన్నా.. తనే ఓ చానల్ పెట్టాలన్న ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. అదీ కూడా తన స్వరాష్ట్రం.. తెలంగాణ లో పెట్టాలనుకుంటున్నారని.. చెబుతున్నారు. తెలంగాణలో సుదీర్ఘ రాజకీయ లక్ష్యాలను పెట్టుకున్న బీజేపీ.. వెంకటకృష్ణకు మద్దతు ఇస్తోందని అంటున్నారు. ఇదే నిజమైతే.. బీజేపీ కోసం.. ఓ చానల్.. తెలంగాణలో లాంచ్ కావడానికి ఎక్కువ కాలం పట్టకపోవచ్చు.