వచ్చే ఆరు నెలల్లో నెల రోజుల పాటు తాను విదేశాల్లో పర్యటిస్తానని అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. ఆరు నెలల్లో నెల రోజుల పాటు యూకే, యూఎస్ఏ, జర్మనీ, దుబాయ్ సింగపూర్ పర్యటిస్తానని చెప్పుకొచ్చారు బెయిల్ షరతులు సడలించాలని కోరారు. ఎందుకు అంటే యూనివర్సిటీలతో ప్రభుత్వ ఒప్పందాల కోసం వెళ్తున్నానని చెప్పుకొచ్చారు. విజయసాయి రెడ్డి పిటిషన్ పై కౌంటరు దాఖలుకు సీబీఐ సమయం కోరడంతో… పిటిషన్ పై విచారణ ఈనెల 30కి వాయిదా వేసింది కోర్టు.
కోర్టులో విజయసాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ చూసి… . అబ్బ…సాయిరెడ్డి తెలివి అనుకోకుండా ఉండలేకపోతున్నారు. ఎవరైనా ఏదైనా పని మీద.. ఫలానా దేశానికి వెళ్తున్నారు… ఇన్ని రోజులు పర్మిషన్ కావాలని అడుగుతారు. కానీ విజయసాయిరెడ్డి మాత్రం.. వచ్చే ఆరు నెలల్లో ఎప్పుడు వెళ్తానో తెలియదు కానీ.. నెల రోజులు చాలా దేశాల్లో తిరుగుతానని పిటిషన్ వేశారు. అంటే ఆయన రహస్య పర్యటనలు చేయాలనుకున్నారని స్పష్టమవుతుంది. వచ్చే ఆరు నెలలు అంటే… ఎన్నికల సమయం. ఎన్నికలకు ముందు వీ.సా.రెడ్డి విదేశాల్లో ఏం చేస్తారు ?. ఎన్నికల ఖర్చుల కోసం నిధులను సమీకరిస్తారా ? సమీకరించిన నిధులను ఇండియాకు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటారా ? ఇలాంటి అనుమానాలు చాలా వస్తాయి.
ఇక్కడ విజయసాయిరెడ్డి చెప్పిన కారణం కూడా చిత్రంగా ఉంది. విదేశీ యూనివర్శిటీలతో ఒప్పందాల కోసం వెళ్తున్నామని చెబుతున్నారు… అసలు ప్రభుత్వంతో విదేశీ వర్శిటీల ఒప్పందాలకు విజయసాయిరెడ్డికి సంబంధం ఏమిటి ? అనేది ఎవరికీ తెలియదు. ఆయనకు అథరైజేషన్ ఇచ్చారా ఇస్తే దాన్ని కోర్టుకు సమర్పించారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఆర్థిక నేరాల్లో దిట్ట విజయసాయిరెడ్డి … నిధుల అక్రమ రవాణాలో ఘనాపాటిగా దేశ రాజకీయవర్గాలు గుర్తించాయి. ఎన్నికలకు ముందు ఆయన ఏం చేసినా… అనుమానంగా చూడటంలో తప్పేమీ లేదు. ఇలా అనుమానాస్పదంగా విదేశీ పర్యటనల గురించి అనుమతల కోసం అడగడమూ అనేక సందేహాలకు తావిస్తోంది.
కొసమెరుపేమిటంటే… తన కుమార్తె లండన్ లో చదువుకుంటోందని… అక్కడకు వారం రోజులు వెళ్తానని ఆయన కూడా దరఖాస్తు పెట్టుకున్నారు.