విజయసాయిరెడ్డి అంటే ఓ రకమైన హేట్ స్పీచ్‌కు బ్రాండ్ అంబాసిడర్. ఆయన పేరు చెబితే గుర్తుకొచ్చేది అత్యంత అసభ్యకరమైన ఆయన ట్వీట్లే. పుట్టిన రోజు .. పండగ రోజు అంటూ ఉండదు.. టీడీపీ నేతలపై అత్యంత దారుణంగా బూతుల దండకం ఎత్తుకోవడం ఆయన స్టైల్. ఉన్నత విద్యావంతుడైన ఆయనలో ఇంత మురికి ఉందా అని రాష్ట్రం మొత్తం అసహ్యించుకుంటూ ఉంటుంది. అయితే ఆయన ఇప్పుడు హఠాత్తుగా స్టైల్ మార్చారు. లోకేష్ పుట్టిన రోజు సందర్భంగాఆయన చెప్పిన శుభాకాంక్షలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.
లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా పద్దతిగా శుభాకాంక్షలు చెప్పారు. ప్రతీ సారి ఆయన లోకేష్ పై పుట్టిన రోజు అయినా సరే .. వదలకుండా తిట్టేవారు. కానీ ఈ సారి మార్పు చెందారు. దీంతో ఆయనలో ఈ మార్పు దేనికి సంకేతం అంటూ.. కొత్త వాదన సోషల్ మీడియాలో ప్రారంభమయింది. విజయసాయిరెడ్డి ఇటీవలి కాలంలో ట్విట్టర్లో అంత యాక్టివ్ గా లేరు. ఆయన అనారోగ్యానికి గురయ్యారన్న ప్రచారం జరిగింది. ఏం జరిగిందో కానీ.. ఆయన తెలుగులో చాలా వరకూ ట్వీట్లు్ తగ్గించేశారు. ఇంగ్లిష్ ట్వీట్లు పెడుతున్నారు కానీ.. తిట్లందుకోవడం లేదు. ఇప్పుడు లోకేష్ కు చెప్పిన శుభాకాంక్షలు కూడా పద్దతిగా ఉన్నాయి.
ఒక్క సారిగా మరిపోయిన విజయసాయిరెడ్డి తీరు చూసి టీడీపీ కార్యకర్తలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది విజయసాయిరెడ్డేనా అని ప్రశ్నిస్తున్నరు. ట్వీట్టర్ అకౌంట్ ను చూసే ఏజెన్సీని మార్చుకున్నారా లేకపోతే.. రాజకీయాలు ఇంతే అని మారిపోయారా అని చర్చ జరుగుతోంది. కారణం ఏదైనా… విజయసాయిరెడ్డి లాంటి నేత వల్ల రాజకీయాలు దిగజారిపోయాయన్న విమర్శలు ఉన్నాయి.. ఇప్పుడు ఆయన పద్దతి మార్చుకుంటే తప్పు దిద్దుకున్నట్లు అవుతుంది.. మళ్లీ పాద బాటే పడితే.. బుద్ది మారదని.. నెటినజ్లు అనుకుంటారు.