జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు విదేశాలకు వెళ్లినా విజయసాయిరెడ్డి కూడా వెళతారు. అయితే జగన్ వెళ్లిన దేశానికి కాదు. వేరే దేశాలకు వెళ్తారు. ఈ లింక్ ఏమిటో తెలియదు కానీ.. ఈ సారి మాత్రం విజయసాయిరెడ్డి చడీ చప్పుడు లేకుండా ఉన్నారు. నెల్లూరులో ఎంపీగా పోటీ చేసిన ఆయన పోలింగ్ ముగిసిన తర్వాత ఎవరికీ కనిపించడం లేదు.
జగన్ బలవంతంగా మీద నెల్లూరులో ఎంపీగా పోటీ చేసిన విజయసాయిరెడ్డి .. అక్కడి పరిస్థితిని చూసి పోలింగ్ ముందు మూడు రోజుల ముందే చేతులెత్తేశారన్న ప్రచారం జరుగుతోంది. ఆర్థిక వ్యవహారాల్లో పండిపోయిన ఆయన…. అతి తక్కువ ఖర్చు చేసి మొత్తం ఎమ్మెల్యే అభ్యర్థులపై వదిలేశారు. ఎమ్మెల్యేలకు ఓట్లేస్తే తనకు వేస్తారు..లేకపోతే లేదన్నట్లుగా వ్యవహరించారు.
పోలింగ్ ముగిసిన తర్వాత ఇక తనకు పనేం లేదన్నట్లుగా సైలెంట్ గా ఉన్నారు. పార్టీ ఆఫీసుల్లోనూ కనిపించడం లేదు. జగన్ తోనూ కనిపించడం లేదు. జగన్ తో బొత్స, పెద్దిరెడ్డి వంటి వారు కనిపిస్తున్నారు. కానీ విజయసాయిరెడ్డి కనిపించడం లేదు. మొత్తంగా విజయసాయిరెడ్డి వ్యవహారం తేడాగా ఉందని వైసీపీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.