ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించడానికి విజయసాయిరెడ్డి నేతృత్వంలోని వైసీపీ ఎంపీల బృందం చేస్తున్న ప్రయత్నాలకు ఫలితం లభించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే వివిధ పద్దతుల్లో కేంద్రాన్ని అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఇప్పుడు భిన్నమైన వ్యూహంలో ముందుకెళ్తున్నారు. ఈ సారి తన అధికార పరిధిని ఉపయోగించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రానికి సిఫార్సు చేశారు. విజయసాయిరెడ్డి వైపు నుంచి జరిగిన ఈ ప్రయత్నం చాలా మందిని ఆశ్చర్య పరిచింది. ఆయన తన రాజకీయం మొత్తాన్ని రంగరించి ఏపీకి ప్రత్యేకహోదా కోసం గట్టి నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.
అసలు విషయం ఏమిటంటే రాజ్యసభ ఎంపీ…పార్లమెంట్లో అతి పెద్ద పార్టీల్లో ఒకటి అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా స్థాయి సంఘం కమిటీల్లో వైసీపీ ఎంపీలకు కీలక పాత్ర లభించింది . అలా విజయసాయిరెడ్డికి వాణిజ్య శాఖపై స్థాయీ సంఘానికి చైర్మన్ పదవి లభించింది. విజయసాయిరెడ్డికి స్థాయి సంఘం సమావేశాలు..నివేదికలు విషయంలో ఎన్నో సార్లు ప్రశంసలు దక్కాయి. సాక్షాత్తూ ఉపారాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు కూడా ఆయనను పలుమార్లు సభాముఖంగా అభినందించారు. అయితే అలాంటి వెంకయ్యనాయుడ్ని పరోక్షంగా కులం అంటగట్టి విజయసాయిరెడ్డి విమర్శించారు అది వేరే విషయం. ఇప్పుడు తన అధికార పరిధి మేరకు ఉన్న వాణిజ్య శాఖ స్థాయీ సంఘ నివేదికలోనే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని సిఫార్సు చేశారు విజయసాయిరెడ్డి.
ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు ..రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేకుండా పోయిందని .. అందుకే వాటికి వాణిజ్యం లేకుండా పోయిందని ఈ కారణంగా కనీసం పదేళ్లకు తగ్గకుండా ఇవ్వాలని విజయసాయిరెడ్డి సిఫార్సు చేశారు. సాధారణంగా స్థాయీ సంఘం సిఫార్సులకు కేంద్రం విలువ ఇస్తుంది. దీన్ని కూడా అంతే సీరియస్‌గా తీసుకుని ఏపీకి ప్రత్యేకహోదా ప్రకటిస్తే అది విజయసాయిరెడ్డి సాధించిన గొప్ప విజయం అవుతుందనడంలో సందేహం లేదు.