వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ… అక్రమాస్తుల కేసుల్లో ఏ-2గా ఉన్న విజయసాయిరెడ్డి ఇండొనేషియా, దుబాయ్‌కు వెళ్లి రావాలని అనుకుంటున్నారు. పనేమిటో చెప్పలేదు కానీ.. కోర్టు అనుమతి కోసం… దరఖాస్తు చేసుకున్నారు. షరతులతో కూడిన బెయిల్ మీద ఉన్న విజయసాయిరెడ్డి పాస్ పోర్టు కోర్టు అధీనంలో ఉంటుంది. దేశం దాటి వెళ్లాలంటే.. ఆయన తప్పనిసరిగా కోర్టు అనుమతి తీసుకోవాలి. కోర్టు అనుమతి ఇస్తే.. అప్పుడు పాస్ పోర్ట్ ఇస్తారు. గతంలోనూ ఒకటి రెండు సార్లు విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి తీసుకున్నారు. కానీ చివరి క్షణంలో వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు మాత్రం అత్యవసర పని మీద వెళ్లడానికే … దరఖాస్తు చేసుకున్నట్లుగా భావిస్తున్నారు.
జగన్ అక్రమాస్తుల కేసుల్లో నిందితుడయిన నిమ్మగడ్డ ప్రసాద్‌ను.. సెర్బియాలో అరెస్ట్ చేసినప్పుడు… రాజకీయ దుమారం రేగింది. విజయసాయిరెడ్డి కూడా విదేశాలకు వెళ్తే అలానే అరెస్ట్ చేస్తారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. వాటిపై విజయసాయిరెడ్డి పెద్దగా స్పందించలేదు కానీ.. ఇప్పుడు.. ఇండొనేషియా.. దుబాయ్ వెళ్లాలనుకుంటున్నారు. నిమ్మగడ్డను అరెస్ట్ చేయడానికి ప్రధాన కారణం.. రస్ ్ల్ ఖైమా దేశంలో ఆ దేశ ప్రభుత్వానికి చెందిన సంస్థను బాక్సైట్ లీజుల పేరుతో మోసం చేయడం.. పెట్టుబడులను వాన్‌పిక్‌లో పెట్టించి.. నష్టపరచడం. వాటికి సంబంధించి సెటిల్మెంట్ చేసుకోవాల్సిన పరిస్థితుల్లో నిమ్మగడ్డతో పాటు.. ఆయన పెట్టుబడులు తీసుకున్న సంస్థలు పడ్డాయి. ఈ క్రమంలో దుబాయ్‌కు విజయసాయిరెడ్డి వెళ్లడం ఆసక్తి రేకెత్తిస్తోంది.
నిమ్మగడ్డ ప్రసాద్ ను సెర్బియాలో రస్ అల్ ఖైమా ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేసినప్పుడు.. జుల్ఫీ రావ్జీ అనే వ్యక్తిని గల్ఫ్ దేశాలకు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. ఆయనకు కేబినెట్ హోదా ఇచ్చారు. నిజానికి ఆయన ఎలా ఉంటారో… కూడా చాలా మందికి తెలియదు. ఆయన చాలా కాలంగాకేబినెట్ హోదా అనుభవిస్తున్నప్పటికీ.. ఆయా దేశాల నుంచి పైసా పెట్టుబడులు తెచ్చినట్లుగా కూడా లేదు. అయితే విజయసాయిరెడ్డి గల్ఫ్ పర్యటనకు వెళ్లినప్పుడు ఆయన ఏర్పాట్లు చూసే అవకాశాలు ఉంటాయి.