వైసీపీలో జరుగుతున్న ఆధిపత్యపోరాటంలో తనను బలిచ్చేందుకు రెడీ చేస్తున్నారన్న విషయాన్ని సాయిరెడ్డి అర్థం చేసుకున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు విజయసాయిరెడ్డి చేసిన భూదందాలు మొత్తం ప్రభుత్వ వర్గాల నుంచే బయటకు వస్తున్నాయి. సొంత పార్టీనేతల ద్వారా విజయసాయిరెడ్డికి చెక్ పెట్టేందుకు తాడేపల్లి నుంచే కొంతమంది గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఎంపీపీ ఎంవీవీ సత్యనారాయణను విజయసాయికి వ్యతిరేకంగా ప్రోత్సహించి ఆయనకు సంబంధించిన వ్యవహారాలన్నీ లీకయ్యేలా చేస్తున్నారు. ఇదంతా విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించిన తరవాతే జరుగుతోంది.
ఇటీవల విజయసాయిరెడ్డికి పార్టీలో ప్రాధాన్యం తగ్గింది. ఉత్తరాంధ్ర నుంచి బయటకు పంపేశారు. సోషల్ మీడియా ఇంచార్జ్ పదవిని పీకేశారు. ఆయనను పార్టీవ్యవహారాల కోసం ఉత్తరాంధ్ర వెళ్లవద్దని స్పష్టం చేశారు. వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు అక్కడ ఇంచార్జ్. అయితే ఒక్క సారిగా విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించగానే… ఆయన చేసిన భూదందాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇదంతా అఫీషియల్‌గా బయటకు వస్తున్న సమాచారం కావడంతో విజయసాయిరెడ్డికి మైండ్ బ్లాంక్ అయింది. తాను విశాఖకు దూరం అయితే తనను ఇంకా ముంచేస్తారని భావించిన ఆయన మళ్లీ తాను విశాఖలోనే ఉన్నానంటూచెప్పుకోవడానికి ప్రయతనిస్తున్నారు.
తాను విశాఖ ఎంపీనేనని అక్కడే ఉంటానని చెప్పడమే కాదు విధానమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. భూముల గురించి మాట్లాడుతున్నారు. దీంతో ఆయన వైసీపీ అధినాయకత్వంపై తిరుగుబాటు చేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు. వారి ఆదేశాలను కాదని ఉత్తరాంధ్రలో పెత్తనం చేయడం మాత్రమే కాదు.. మరికొన్ని భూముల డీలింగ్స్ గురించి ప్రస్తావించారు. ఎంవీవీ సత్యనారాయణ చేపడుతున్న ప్రాజెక్టుల గురించి ప్రస్తావిస్తున్నారు.
సజ్జల రామకృష్ణారెడ్డి ప్లానో.. విజయసాయిరెడ్డి అత్యాశో కానీ .. ఆయన చేస్తున్న పనుల వల్ల జగన్ తో దూరం పెరిగింది. ఆ విషయంలో విజయసాయిరెడ్డికి మద్దతుగా ముందుకు రాని సాక్షి మీడియాతోనే స్పష్టమైంది. ఇప్పుడు విజయసాయిరెడ్డి తిరుగుబాటు ఎక్కడిదాకా అన్నది తేలాల్సి ఉంది.