అక్రమ సంబంధాలు తనకు లేవని కావాలంటే దేవుడిపై ఒట్టేసి చెబుతానని విజయసాయిరెడ్డి ఓపెన్ అయిపోయారు. జనం అంతా తన గురించి ఏదో అనుకుంటున్నారని ఫీలయ్యే రకం విజయసాయిరెడ్డి కాదు. అలా అనుకునేవాడయితే… గత ఐదేళ్ల కాలంలో గొలుసు తెగిన జంతువులా ట్వీట్లు పెట్టేవారు కాదు. కానీ ఎవరో నమ్ముతున్నారని.. ఆయనకు అర్థమవుతోంది. అందుకే వారికి సర్ది చెప్పడానికన్నట్లుగా ఓ ట్వీట్ చేశారు. ప్రజల కోసం అన్నట్లుగా చెప్పుకొచ్చారు.
Read More : కమ్మ మహాసభలో పరోక్షంగా చంద్రబాబు అరెస్ట్ ను ప్రస్తావించిన రేవంత్..ఏమన్నారంటే?
ఈ ట్వీట్లో విజయసాయిరెడ్డి శాంతిని ఎప్పుడు కలిశాను.. ఎలా కలిశాను.. ఎందుకు సాయం చేశాను.. తన ఇంటికి శాంతి ఎందుకు వచ్చింది.. తన బిడ్డను తీసుకుని ఎందుకు వచ్చింది..తాను ఎందుకు ఆశీర్వాదం ఇచ్చాను వంటివన్నీచెప్పారు. ఎందుకంటే.. ఆమెను కూతురిగానే చూశారట. కూతురుగానే చూస్తే.. కోటి అరవై లక్షల రూపాయల నగదు ఇచ్చేస్తారా ?. ఇంకా తెలియకుండా ఎంత ఇచ్చారు లాంటివన్నీ..చేసిన సాయాలన్నీ తెలియాల్సిన వాళ్లకు తెలిశాయా అన్న డౌట్ ఈ ట్వీట్ చూసిన వారికి అర్థమైపోతుంది.
విజయసాయిరెడ్డి తీవ్ర టెన్షన్ లో ఉన్నారు. శాంతి తో వ్యవహారంలో ఆయనకు డీఎన్ఎ టెస్టుల కోసం డిమాండ్ పెరుగుతుంది. శాంతి భర్త మదన్ మోహన్ పదేపదే అదే డిమాండ్ చేస్తున్నారు. అయితే విజయసాయిరెడ్డి మాత్రం అదొక్కటి్ మాట్లాడటం లేదు. మిగతా అన్నీ మాట్లాడుతున్నారు. చివరికి తనకు అక్రమ సంబంధాల్లేవని.. ట్వట్లు పెట్టుకోవాల్సిన పరిస్థితికి వచ్చారు.