నువ్ తమలాపాకుతో ఒకటంటే.. నేను తలుపుచెక్కతో రెండంటా అనేది సామెత. నిజం కూడా. ఎందకంటే.. నోరు ఒక్కరికే కాదు.. అందరికీ ఉంటుంది. ఎవరైనా మాట జారితే..అంతకు మించి మాటల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనికేని ఢక్కామొక్కీలు తినాల్సిన అవసరం లేదు. కాస్త బుద్దీ, జ్ఞానం ఉంటే తెలిసిపోతుంది. కానీ ఉన్నత చదువులుచదివి.. నీట్ గా టక్ చేసుకుని కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్లా పద్దతిగా కనిపించే విజయసాయిరెడ్డికి మాత్రం ఈ విషయం తెలియడం లేదు. ఎవరో ఒకర్ని విమర్శించడం.. వారితో నాలుగు మాటలు పడటం కామన్ అయిపోయింది.
తాజాగా రఘురామకృష్ణరాజుపై ఆయన మరోసారి ట్విట్టర్లో విమర్శలు చేశారు. విగ్గు రాజు.. పెగ్గు రాజు అంటూ… ట్వీట్లు చేశారు. ఆయనకేనా ట్విట్టర్ ఉంది… రఘురామకూ లేదా..? ఆ విషయం కాసేపటికే తేలిపోయింది. రఘురామ కూడా విజయసాయిరెడ్డికి ఇదే విధంగా కౌంటర్లు ఇచ్చారు. విగ్గు రాజు.. పెగ్గు రాజు అన్నట్లుగా.. కండోమ్ రెడ్డి, రసిక వానరా… ఇలాంటి పేర్లతో కౌంటర్ ఇచ్చారు. ఈ పేర్లను ఇప్పుడు ఇతరలు వైరల్ చేస్తున్నారు. కండోమ్ రెడ్డి అని రఘురామ ఎందుకన్నారు ? రసిక వానరుడు ఎలా అయ్యారు? అని లేని పోని రూమర్లతో సోషల్ మీడియాలో చర్చ పెట్టుకుంటున్నారు.
రఘురామకృష్ణరాజును తిట్టడం ద్వారా ఎవరిని విజయసాయిరెడ్డి సంతృప్తి పరచాలనుకున్నారో.. తెలియదు కానీ ఆయనపై మాత్రం ఒకటికి పది బూతులు వచ్చి పడుతున్నాయి. రఘురామ మాత్రమే కాదు.. ఆయన చేసిన తిట్లతో ఇతర ట్రోలర్స్ విజృంభిస్తున్నారు. అయితే విజయసాయిరెడ్డి ఇలాంటివన్నీ ఎప్పుడో వదిలేశారని.. ఎవరు ఏమీ అన్నా ఆయన దులిపేసుకుంటున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన దులిపేసుకోవచ్చు కానీ ఆయన చుట్టూ ఉన్న వారు మాత్రం ఆయనను చులకనగా చూడటం ఖాయమే కదా అన్న అభిప్రాయం వినిపిస్తోంది. అందరికీ నోరు ఉంటుందనే విషయాన్ని గుర్తు పెట్టుకుంటే.. ఇలా తనను తన కుటుంబాన్ని సోషల్ మీడియాలో చర్చకు పెట్టరన్న అభిప్రాయం ఎక్కువ మందిలో వినిపిస్తోంది.