విశాఖలో విజయసాయిరెడ్డి తన కుమార్తె నేహారెడ్డి పేరుతో ఏకంగా బీచ్ నే కబ్జా చేయబోతున్నారు. భీమిలి బీచ్ లో అడ్డంగా గోడ కూడా కట్టేశారు. రీటైనింగ్ వాల్ తరహాలో ఆయన కట్టించిన వాల్ ను గ్రేటర్ విశాఖ అధికారులు కూల్చివేస్తున్నారు .
వైసీపీ ఉన్న ఐదేళ్లలో విశాఖలో చేయని దందా లేదు. విజయసాయిరెడ్డి అల్లుడు ఆయన కంపెనీల పేరుతో వందల ఎకరాలు కొనుగోలు చేశారు. మరికొన్ని వందల ఎకరాలు ప్రభుత్వం నుంచి రాయించుకున్నారు. తన కుమార్తె కొనుక్కుంటే తనకేం సంబంధం అని ఆయన ఎదురుదాడి చేశారు. భీమిలి దగ్గర ఫైవ్ స్టార్ హోటల్ కడతామని చెప్పి భూమిని కబ్జా చేసి.. ఇప్పుడు ఆ బీచ్ కు అడ్డంగా గోడకట్టేశారు. ఇది సీఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధం కావడంతో కూల్చివేస్తారన్న భయంతో ముందుగానే కోర్టుకెళ్లారు.
కోర్టులో నిబంధనలకు విరుద్థమైతే.. అక్రమ కట్టడం అయితే కూల్చివేయాలని స్పష్టం చేశారు. దీంతో జీవీఎంసీ అధికారులు ఉదయమే జేసీబీలతో వచ్చి కూల్చివేతలు ప్రారంభించారు. అయితే ఈ కూల్చివేతల్ని అడ్డుకోవడానికి ఒక్క వైసీపీ నేత కూడా రాలేదు. కనీసం విజయసాయిరెడ్డికి చెందిన ఆస్తి అని పరిశీలించడానికి కూడా ఎవరూ రాలేదు. దాంతో కూల్చివేతలు సాఫీగా సాగిపోతున్నాయి. విజయసాయిరెడ్డి నిర్వాకాలతో విశాఖలో వైసీపీ మట్టికొట్టుకుపోయిందని ఆయన వ్యవహారాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే.. స్పందించకూడదని నిర్ణయించుకున్నారు.
విజయసాయిరెడ్డి విశాఖలో చేసిన భూ దందాలకు సంబంధించి త్వరలోనే సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయని విశాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి.