మెగా హీరోల గ్యాంగ్ పెరుగుతున్న కొద్దీ వాళ్ల మధ్య పోటీ కూడా వచ్చేస్తోంది. తెలియకుండానే… ఇద్దరు మెగా హీరోల సినిమాలు ఒకేసారి పడుతున్నాయి. ఆధ్య వరుణ్‌తేజ్, సాయి ధరమ్ తేజ్ సినిమాలు ఒకేసారి విడుదలయ్యాయి. ఇప్పుడు మరోసారి మెగా చిత్రాలు ఢీ కొట్టాల్సింది. సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా నటించిన ‘తేజ్’ జులై 6న విడుదల చేద్దామనుకున్నారు. సరిగ్గా అప్పుడే మెగా అల్లుడు కల్యాణ్ దేవ్ సినిమా `విజేత`నీ విడుదల చేద్దామనుకున్నార్ట. కానీ సాయిధరమ్ తేజ్ కోసం ఈ సినిమాని వారం రోజులు వాయిదా వేశార్ట. ఈ విషయాన్ని ‘విజేత’ ఆడియో వేడుకలో చిరంజీవినే చెప్పారు. ”ఇద్దరి సినిమాలు ఒకేసారి విడుదల కావల్సింది. రెండూ మన సినిమాలే. ఎక్కడ క్లాష్ అవుతాయో అనుకున్నా. కానీ సాయి కొర్రపాటి జులై 12కి `విజేత` మార్చారు. దాంతో వారం రోజుల గ్యాప్ లో రెండు సినిమాలు రాబోతున్నాయి. రెండూ ప్రేక్షకుల్ని అలరిస్తాయన్న నమ్మకం ఉంద”న్నారు. సో… మెగా హీరోల క్లాష్ ఈసారికి తప్పింది. మెగా ఫ్యాన్స్ ముందు మేనల్లుడి సినిమా, ఆ తరవాత అల్లుడి సినిమా చూసేయొచ్చన్నమాట.