హైదరాబాద్ విస్తరిస్తున్న రద్దీ దూరంగా అనిపించిన ప్రాంతాలు దగ్గరగా మారుతున్నాయి. ఇప్పుడు వికారాబాద్ కూడా హైదరాబాద్ శివారు అని చెప్పుకుంటున్నారు. దాదాపుగా 70 కిలోమీటర్ల దూరంలో ఉండే వికారాబాద్ ను హైదరాబాద్ కలిపేసుకుని రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. కప్పుడు మేడ్చల్‌కు వెళ్లాలంటే ఎంతో దూరం అనిపించేది. తెల్లాపూర్‌కు వెళ్లాలంటే మహా కష్టం అయ్యేది. ఇదే పరిస్థితి ఘట్కేసర్, ఉందానగర్ ప్రాంతాలది. కానీ, ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. వికారాబాద్ కూడా దగ్గరగా మారుతోంది.
వికారాబాద్ పచ్చదనంతో ఉంటుంది. చుట్టూ ఉండే కొండలు ప్రత్యేకమైన ఆకర్షణ. ప్రశాంతమైన వాతావరణం కారణంగా వికారాబాద్‌లో నివాస స్థలాలు, ఫామ్‌హౌస్‌లకు డిమాండ్ పెరుగుతోంది. కొన్ని సంవత్సరాలుగా, వికారాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ గణనీయమైన వృద్ధిని సాధించింది. హైదరాబాద్‌కు దగ్గరగా ఉండటం వల్ల ప్రశాంతంగా ఉండేందుకు ఒక ఆకర్షణీయమైన విడిది ప్రాంతంగా వికారాబాద్ మారింది. రియల్ ఎస్టేట్ డెవలపర్లు వికారాబాద్ కు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి వివిధ ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. నివాస ప్లాట్లు, ఫామ్‌హౌస్‌లు, ఓపెన్ ప్లాట్లు మరియు వెంచర్ ప్లాట్లు అన్నీ అందుబాటులో ఉన్నాయి, .
భవిష్యత్తు అవసరాల కోసం ఆయా ప్రాంతాల్లో ఇంటి స్థలాలు కొనుగోలు చేస్తే.. ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందవచ్చు. అందుకే, ఎవరికి అనుకూలమైన ప్రాంతంలో వారి వారి బడ్జెట్ మేరకు.. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఇంటి స్థలం, లేదంటే ఇల్లు కొనుగోలు చేయాలని నిపుణులు సలహాలిస్తుతున్నారు. ఈ లెక్కన వికారాబాద్ చాలా మంచి ఆప్షన్ అవుతుంది. వికారాబాద్‌లోని ఇళ్ల స్థలాలు పరిమాణాన్ని బట్టి 14 లక్షల నుండి ప్రారంభమవుతున్నాయి. రియల్ వెంచర్లకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు.