ఇండియన్ సినిమాలకు ‘బాహుబలి’ కొత్త మార్కెట్ చూపింది. సిన్మా స్టార్టింగ్ నుంచి కరెక్ట్ ప్లానింగుతో వరల్డ్ క్లాస్ సినిమా తీసి, మార్కెటింగ్ చేసుకుంటే హాలీవుడ్ సినిమాల స్థాయిలో వెయ్యి కోట్లు, రెండు వేల కోట్లు వసూళ్లు సాధించడం పెద్ద కష్టం కాదని నిరూపించింది. దాంతో ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ భారీ బడ్జెట్ ఫాంటసీ ఫిల్మ్స్ తీయడానికి రెడీ అవుతున్నారు. ‘బాహుబలి’ తర్వాత అనౌన్స్ చేసిన భారీ బడ్జెట్ ఫాంటసీ ఫిల్మ్స్ లో ‘మహావీర్ కర్ణ్’ ఒకటి. తమిళ్ స్టార్ విక్రమ్ హీరోగా మలయాళీ దర్శకుడు ఆర్.ఎస్. విమల్ హిందీలో తీయనున్న ఈ సినిమా బడ్జెట్ రూ.300 కోట్ల. రిలీజ్ కూడా అదే లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 37 భాషల్లో విడుదల ఈ సినిమాను చేయనున్నట్టు విక్రమ్ తెలిపారు. “జస్ట్ బిజినెస్ కోసం అన్ని భాషల్లో విడుదల చేయడం లేదు. ‘టెన్ కమాండ్మెంట్స్’, ‘బెన్హర్’ సిన్మాలు ప్రపంచంలోని అన్ని భాషల ప్రేక్షకుల్నీ ఎలా ఆకట్టుకున్నాయో… మన మహాభారతంలోని కర్ణుడి కథ సైతం అంతమందినీ ఆకట్టుకుంటుంది” అని విక్రమ్ పేర్కొన్నారు. నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో ‘మహావీర్ కర్ణ్’ షూటింగ్ స్టార్ట్ చేస్తారట. వచ్చే నెలలో సినిమా కంప్లీట్ డీటెయిల్స్ అనౌన్స్ చేసినప్పుడు ప్రేక్షకులు సర్ ప్రైజ్ అవుతారని విక్రమ్ చెబుతున్నారు.