విక్రమ్ కె.కుమార్… ప్రస్తుతం ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ లో మోస్ట్ వంటెడ్ దర్శకుడు. టాప్ హీరోలంతా విక్రమ్‌తో ఒక్కసారైనా పనిచేయాలని ఆసక్తి చూపిస్తున్నారు. 24తో విక్రమ్ డిమాండ్ మరింతగా పెరిగింది. అయితే విక్రమ్ ఇప్పుడు అల్లు అర్జున్‌తో కమిట్ అయ్యాడు. 24కి ముందే కర్ఛీఫ్ వేసుకొన్న బన్నీ.. రిలాక్స్‌గా ఉన్నాడు. అయితే విక్రమ్ కె.కుమార్ మాత్రం బన్నీకి భారీ ఝలక్ ఇచ్చాడు. నవంబర్ వరకూ బన్నీతో సినిమా పట్టాలెక్కించే అవకాశం లేదని ఇప్పుడు విక్రమ్ చెబుతున్నాడు. దాంతో విక్రమ్ కోసం బన్నీ నవంబరు వరకూ ఆగాల్సిన పరిస్థితి వచ్చింది.
సరైనోడు పూర్తయిన వెంటనే విక్రమ్ సినిమాని పట్టాలెక్కించాలని భావించాడు బన్నీ. విక్రమ్ ఎలాగూ మాటిచ్చాడు కదా, అన్న ధీమాలో ఉన్నాడు. అయితే విక్రమ్ మాత్రం ఇప్పటికిప్పుడు సినిమా మొదలెట్టే మూడ్‌లో లేడట. పూర్తిస్థాయి కథ సిద్ధం అవ్వడానికి కనీసం ఆరు నెలల సమయం పడుతోందని చెప్పాడట. దాంతో బన్నీ ఇప్పటికిప్పుడు లింగుస్వామిని రంగంలోకి దింపడానికి ప్రయత్నాలు మొదలెట్టాడు. నిన్నా మొన్నటి వరకూ లింగుస్వామిని పక్కన పెట్టేద్దామని భావించిన బన్నీకి ఇప్పుడు అతనే దిక్కయ్యాడు.